Home » Kaleshwaram Project
రాష్ట్రంలో సత్వరం పరిష్కరించాల్సిన సమస్యల గురించి చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాళేశ్వరం తదితర కీలక అంశాలపై చర్చించేందుకు ఈసీ అనుమతిస్తుందన్న నమ్మకంతో శనివారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలో ఎదురు చూసిన రాష్ట్ర మంత్రులకు చివరకు నిరాశే ఎదురైంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థితిగతులపై ఏకకాలంలో మూడు కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజీని ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం(సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స)తో, అన్నారం బ్యారేజీని పుణెలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ(సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)తో, సుందిళ్ల బ్యారేజీని హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఏ)తో అధ్యయనం చేయించనున్నారు.
లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై ఫోకస్ పెట్టింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
వానాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలనే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) మధ్యంతర నివేదికపై శనివారం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల వనరులసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎ్సఏ నిపుణుల కమిటీ మూడు బ్యారేజీలకు వర్షాకాలం ప్రారంభానికి ముందు అత్యవసరంగా చేపట్టాల్సిన తాత్కాలిక మరమ్మతులు, తదుపరి అధ్యయనాలను సిఫారసు చేస్తూ గతంలో నివేదిక అందించింది.
జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికకు లోబడి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయాలని ఎల్ అండ్ టీని నీటిపారుదల శాఖ కోరింది. ఈ మేరకు నిర్మాణ సంస్థకు రామగుండం చీఫ్ ఇంజనీర్ లేఖ రాశారు. మేడిగడ్డకు తదుపరి మరమ్మతులు చేయాలంటే కాంపోనెంట్ల వారీగా కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ మేరకు చెల్లింపులూ చేయాల్సి ఉంటుందని ఎల్ అండ్ టీ ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేసి, వాటిని జూన్ 10 లోగా పునరుద్ధరించాలని జస్టిస్ పీసీ ఘోష్ అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలు దెబ్బతినడం, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జస్టిస్ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరుగుతన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల రాష్ట్రంలో పర్యటించారు. అనంతరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎ్సఏ)కి లేఖ రాశారు. ఆయన లేఖతో.. బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకునే చర్యలపై ఎన్డీఎ్సఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది.
కాళేశ్వరం బ్యారేజీలతో పాటు కన్నెపల్లి (మేడిగడ్డ), సిరిపురం (అన్నారం), సుందిళ్ల పంప్‌హౌ్‌సల నిర్మాణానికి సంబంధించి రామగుండం పూర్వ ఈఎన్సీ నల్లా వెంక టేశ్వర్లుపై జస్టిస్ పినాకి
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ నుంచి సిరిసిల్లకి వెళ్తుండగా కేసీఆర్‌కి మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన సెగ తగిలింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోవాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ సూచించారు.
మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు అత్యవసరమని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) పేర్కొంది. బ్యారేజీ మరింత దెబ్బతినకుండా ఉండేందుకు వానాకాలంలోపు మరమ్మతులు చేయాలని సూచించింది.