Home » Kaleshwaram Project
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, గోదావరి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అధిక వడ్డీతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రుణాలు తీసుకున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) విమర్శించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో కాంగ్రెస్ నేతలు చూపుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఏటీఎంలా వాడుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించేందుకు గురువారం(రేపు) రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనుంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే వారంతా బయలుదేరనున్నారు. అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాలు తెలుసుకోవడానికి తాము సూచించిన సిఫారసుల ప్రకారం జరిగిన పరీక్షల నివేదికలు అందించాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) ఆదేశించింది.
మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద అనుకోకుండా మూడు పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని, వాటిని సకాలంలో బాగుచేయించి సాగునీటిని అందుబాటులోకి తేవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
‘తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల ఖర్చయితేనే కాంగ్రెస్ గల్లీనుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది. అలాంటిది.. మూసీ సుందరీకరణకు రూ.లక్షా యాబైవేల కోట్లా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మూసీప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో...
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇరిగేషన్ వ్యవస్థపై దేశ రాజధానిలోని ఆయన నివాసంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రేవంత్ రెడ్డి అధికారిక నివాసంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు అధికారులు పాల్గొన్నారు.