Share News

Kaleshwaram Project: కాళేశ్వరంపై కొనసాగుతున్న కమిషన్ విచారణ.. పలువురికి నోటీసులు?

ABN , Publish Date - Jul 08 , 2024 | 03:27 PM

Telangana: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. తాజాగా కాళేశ్వరంపై రిపోర్ట్‌ను కమిషన్‌‌కు కాగ్ అందజేసింది. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్టు ఇవ్వాలని మరోసారి కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది.

Kaleshwaram Project: కాళేశ్వరంపై కొనసాగుతున్న కమిషన్ విచారణ.. పలువురికి నోటీసులు?
Kaleshwaram Project

హైదరాబాద్, జూలై 8: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై (Kaleshwaram Project) జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ (Justice PC Chandraghosh Commission) విచారణ కొనసాగుతోంది. తాజాగా కాళేశ్వరంపై రిపోర్ట్‌ను కమిషన్‌‌కు కాగ్ (CAG) అందజేసింది. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్టు ఇవ్వాలని మరోసారి కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. 14 మంది పంప్ హౌస్ ఇంజనీర్లు నేడు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈనెల 16వ తేదీ వరకు ఆఫ్రిడేవిట్లను ఫిల్ చేయాలని ఇంజనీర్లను కమిషన్ ఆదేశించింది.

Liquor case: ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో విచారణ శుక్రవారానికి వాయిదా..


అలాగే పంప్ హౌస్ నిర్మించిన ఏజెన్సీ నుంచి ఇద్దరు ప్రతినిధులు.... కమిషన్ ముందు హాజరయ్యారు. బ్యారేజీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అఫిడవిట్ ఫిల్ చేయాలని వారికి కాళేశ్వరం కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టులు కూడా కమిషన్‌ వద్దకు చేరుకున్నాయి. అఫిడవిట్ల పరిశీలన తరువాత పలువురికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజు విచారణను కమిషన్ పూర్తి చేసింది. కాగ్ రిపోర్ట్ పరిశీలన తరువాత స్టేట్ కాగ్ అధికారులను కమిషన్ విచారణకు పిలువనుంది.


ఇవి కూడా చదవండి..

AP Government: ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల..

Telangana: తెలంగాణపై టీడీపీ ఫోకస్.. టార్గెట్ జీహెచ్‌ఎంసీ..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 08 , 2024 | 03:42 PM