Home » Karnataka
పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టిన ఘటన బెళగావి(Belagavi) జిల్లాలో చోటు చేసుకుంది. నిప్పాణి తాలూకా అక్కోళ గ్రామంలో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు.
అటవీప్రాంతాల ఆక్రమణలు పెరిగిపోతుండడంతో వన్యప్రాణులకు తగిన ఆహార లభించక శివారుప్రాంతాలలోని ప్రజల నివాసాలు, పంట పొలాలవైపు చొచ్చుకు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవలికాలంలో ఏనుగులనుంచి పంట పొలాలకే కాకుండా కూలీ కార్మికులకు రక్షణ లేకుండా పోతోంది.
రాష్ట్రంలో అధికార పంపిణీ విషయమై సీఎం, డీసీఎంలు ఇటీవల రెండు రోజులుగా వ్యాఖ్యానిస్తున్న తరుణంలో హోం మంత్రి పరమేశ్వర్(Home Minister Parameshwar) తీవ్రమైన ఆరోపణ చేశారు. రాష్ట్రంలో అధికార పంపిణీకి సంబంధించి ఒప్పందం జరిగిందనే విషయం నాకు తెలియదన్నారు.
ముడా ఇంటి స్థలాల వివాదంలో నగరాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి దీపాచోళన్(IAS officer Deepa Cholan) ఈడీ విచారణకు హాజరయ్యారు. నోటీసులు జారీ చేసిన మేరకు మంగళవారం బెంగళూరు శాంతినగర్(Bangalore Shantinagar)లోని ఈడీ కార్యాలయానికి రికార్డులతో పాటు సెక్రటరీ హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫెంగల్ తుఫాను ప్రభావం తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రధానంగా తీరప్రాంత జిల్లాలు ఉత్తర కన్నడ, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఓ యువ ఐపీఎస్ కథ విషాదాంతంగా ముగిసింది. ఎన్నో ఏళ్ల కష్టానికి ప్రతిఫలం లభించే సమయంలో రోడ్డు ప్రమాదం ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఈ ప్రమాదంలో కర్నాటక రాష్ట్రం ఓ యువ అధికారిని కోల్పోయింది..
ప్రత్యేక రాయలసీమ సాధనకై డిసెంబరు 27న తిరుపతి(Tirupati)లో నిర్వహిస్తున్న ‘రాయలసీమ పొలికేక’ సభకు బెంగళూరు(Bengaluru)లో స్థిరపడిన ప్రవాస రాయలసీమ వాసులు తరలిరావాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి(Kuncham Venkatasubba Reddy) పిలుపునిచ్చారు.
విజయనగరం(Vijayanagaram) జిల్లా హర్పనహళ్ళి పట్టణంలోని ఉపాధ్యాయుల వీధిలో ఓ ఇంట్లో పులి ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి 11గంటల సమయంలో చిరుతపులి(Leopard) తిరుగుతున్న దృశ్యాలు ఓ ఇంట్లోని సీసీ కెమెరా(CC camera)లో రికార్డు అయ్యాయి.
రైతులు ఐక్యమత్యంగా ఉండి తమ భూములను రక్షించుకోవాలని చంద్రశేఖరనాథ స్వామీజీ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. ముస్లింలకు ఓటు హక్కు నిరాకరించాలన్నారు. కనిపించిన భూములన్నీ తమవేనంటూ వక్ఫ్ బోర్డు లాక్కోవడం ధర్మ విరుద్ధమన్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ‘ముడా’ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంతోపాటు ఉప ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఓటమితో ఖంగు తిన్న తరుణంలోనే బలప్రదర్శనకు సిద్ధమయ్యారు.