Share News

Bengaluru: ‘రాయలసీమ పొలికేక’కు తరలిరండి

ABN , Publish Date - Dec 01 , 2024 | 01:30 PM

ప్రత్యేక రాయలసీమ సాధనకై డిసెంబరు 27న తిరుపతి(Tirupati)లో నిర్వహిస్తున్న ‘రాయలసీమ పొలికేక’ సభకు బెంగళూరు(Bengaluru)లో స్థిరపడిన ప్రవాస రాయలసీమ వాసులు తరలిరావాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి(Kuncham Venkatasubba Reddy) పిలుపునిచ్చారు.

Bengaluru: ‘రాయలసీమ పొలికేక’కు తరలిరండి

- సీమ జిల్లాలకు న్యాయం జరగాలంటే చేతులు కలపాలి

- ప్రవాసాంధ్రులకు కుంచం పిలుపు

బెంగళూరు: ప్రత్యేక రాయలసీమ సాధనకై డిసెంబరు 27న తిరుపతి(Tirupati)లో నిర్వహిస్తున్న ‘రాయలసీమ పొలికేక’ సభకు బెంగళూరు(Bengaluru)లో స్థిరపడిన ప్రవాస రాయలసీమ వాసులు తరలిరావాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి(Kuncham Venkatasubba Reddy) పిలుపునిచ్చారు. బెంగళూరులో శనివారం తెలుగు ప్రతినిధులను ఆహ్వానించారు. ఇదే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాలను చాటి చెప్పేందుకు సభ జరుపుతున్నామన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Tirumala: అలిపిరిలో తనిఖీల వైఫల్యం.. అన్యమత వ్యాఖ్యలతో తిరుమలకు వచ్చిన కారు


కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం(Kadapa, Kurnool, Chittoor, Anantapur, Nellore, Prakasam) జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కృష్ణ, తుంగభద్ర, పెన్నా నదుల అనుసంధానంతో 36లక్షల ఎకరాలకు సాగునీరు కల్పించేందుకు 1900లోనే బ్రిటీష్‌ ఇంజనీర్‌ సర్‌ మెకంజీ రూపకల్పనకు ఆచరణ జరగలేదన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కృష్ణ, పెన్నార్‌ ప్రాజెక్టు 1951లోనే కమిషన్‌ ఆమోదం పొందినా అమలు చేయలేకపోయారన్నారు.


శ్రీభాగ్‌ ఒప్పందంతో నీటిపై హక్కులు లేకుండా పోయాయన్నారు. నాగార్జున సాగర్‌ నుంచి రాయలసీమకు ఒక చుక్కనీరు లభించలేదని, సమైక్యాంధ్రపేరిట కోస్తాకు తరలిందన్నారు. ప్రత్యేక రాయలసీమ నినాదం రాజకీయ పార్టీలతో సంబంధం లేనిదన్నారు. అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. తమిళనాడు, కర్ణాటకలోని సరిహద్దు జిల్లాల పరిస్థితి రాయలసీమ తరహాలోనే ఉందని వీటిని ఉమ్మడి రాయలసీమలో కలపాలన్నారు. రాయలసీమవాణిని ఢిల్లీలోనూ వినిపించదలిచామన్నారు.


ఈవార్తను కూడా చదవండి: నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నారు

ఈవార్తను కూడా చదవండి: సస్పెండైన ఏఈఈ నిఖేష్‌ కుమార్‌ బాగోతం..

ఈవార్తను కూడా చదవండి: త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్‌

ఈవార్తను కూడా చదవండి: ఏడాదిలోనే ఆలయాల్లో సౌకర్యాలు మెరుగుపరిచాం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 01 , 2024 | 01:30 PM