Home » KCR
సీతారామ ఎత్తిపోతల పథకం(sita rama lift irrigation project) ప్రారంభోత్సవంతో తన రాజకీయ జీవిత కల సాకారమైందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageswara Rao) పేర్కొన్నారు.
రక్తదాన శిబిరాలను విరివిగా చేపట్టి రక్త నిధులను పెంచాలని, సకాలంలో రక్తం అందించి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. రెడ్‌క్రాస్ ప్రతినిధులకు సూచించారు.
గత ప్రభుత్వ నిర్వాకంవల్లే గ్రామ పంచాయతీలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు వారికి లేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు, పౌరుషం ఉంటే ITIR మంజూరు చేయించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ITIR శంకుస్థాపన చేయించి బీజేపీ నేతలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.
మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిలపై ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్‌రావు సంచలన విమర్శలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందని చెప్పారు. వారి పాలన పోయి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని గోనె ప్రకాష్‌రావు పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుల వైఫల్యంపై భూపాలపల్లి జిల్లా కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజీలో జరిగిన నష్టంపై ప్రైవేటు పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు తాఖీదులు జారీ చేసింది.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావుకి బిగ్ షాక్ తగిలింది. డిజైన్ల మార్పు, నాణ్యత లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమంటూ ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణలో కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఉప్పల్ ఫ్లైఓవర్‌ను 6 ఏళ్లు అయిన పూర్తి చేయకపోవడం ప్రజలకు అవమానకరమని తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి హైదరాబాద్ విశ్వనగరం చేస్తున్నామని అన్నారని.. కానీ 6 ఏళ్లు అయిన ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు సభలో తలపడ్డాయి. జూలై 23న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వరకు రెండ్రోజుల విరామ దినాలతో కలిపి తొమ్మిది రోజుల పాటు సాగాయి.
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసగించిన, దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసి బర్తరఫ్ చేసిన ఘనత కేసీఆర్దైతే.. సోనియాగాంధీ నేతృత్వంలో దళిత బిడ్డను స్పీకర్‌ను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.