Share News

Komati Reddy: ఉప్పల్ ఫ్లై ఓవర్‌ విషయంలో KCR సిగ్గుపడాలి

ABN , Publish Date - Aug 04 , 2024 | 07:41 PM

ఉప్పల్ ఫ్లైఓవర్‌ను 6 ఏళ్లు అయిన పూర్తి చేయకపోవడం ప్రజలకు అవమానకరమని తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి హైదరాబాద్ విశ్వనగరం చేస్తున్నామని అన్నారని.. కానీ 6 ఏళ్లు అయిన ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

 Komati Reddy: ఉప్పల్ ఫ్లై ఓవర్‌ విషయంలో KCR సిగ్గుపడాలి
Minister Komati Reddy Venkat Reddy

హైదరాబాద్: ఉప్పల్ ఫ్లైఓవర్‌ను 6 ఏళ్లు అయిన పూర్తి చేయకపోవడం ప్రజలకు అవమానకరమని తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి హైదరాబాద్ విశ్వనగరం చేస్తున్నామని అన్నారని.. కానీ 6 ఏళ్లు అయిన ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఉప్పల్, నారపల్లి ప్లై ఓవర్ పనులు 6 ఏళ్ల నుంచి 6 కిలోమీటర్లు కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయిందని మండిపడ్డారు. పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుందన్నారు. వరంగల్, భువనగిరి నుంచి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.


ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులు పూర్తి కాకపోవడంతో అధికారులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రూ. 600 కోట్లతో 2018లో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 6 ఏళ్లు అవుతున్న 6 కిలో మీటర్ల పనులు పూర్తి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. నారపల్లిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడో తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని నేషనల్ హైవే ఆర్వో పుష్ప తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సిగ్గుపడాలని అన్నారు. ఉప్పల్ ఫ్లైఓవర్‌పై గతంలో రేవంత్ రెడ్డి పార్లమెంట్‌లో 10 సార్లు అడిగారని గుర్తుచేశారు.


మళ్లీ ఉప్పల్ ఫ్లైఓవర్ టెండర్ పిలుస్తామని ప్రకటించారు. ఫ్లై ఓవర్ పూర్తి చేయడానికి మరో రూ. 2, 3 వందల కోట్లు పెరుగుతుందని అన్నారు. 10 రోజుల్లో ఉప్పల్ చౌరస్తా నుంచి ఘట్‌కేసర్ ORR వరకు రోడ్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఫ్లై ఓవర్ పనులు దసరా నాటికీ మొదలు పెడతామని వెల్లడించారు. 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామని వివరించారు. కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని విమర్శించారు. ఉప్పల్ ఫ్లైఓవర్‌ను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. డిసెంబర్‌లో మూసీ పనులు మొదలు పెడతామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవి కోసం బీఆర్ఎస్‌లోకి వెళ్లారని చెప్పారు. నవంబర్ ఒకటో తేదీ అంబర్‌పేట ఫ్లై ఓవర్ ప్రారంభిస్తామని చెప్పారు. 3 నెలల్లో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి 6 లైన్ల రోడ్ పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


అధికారులపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్

అధికారులపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ అయ్యారు. ఆరేళ్లయిన 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ ఒక సంవత్సరం చేయకపోతే... రెండో సంవత్సరం ఎందుకు కాంట్రాక్టు రద్దు చేయలేదని నిలదీశారు. ఆరేళ్లు ఎందుకు ఆగారని అడిగారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఏమి చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.

Updated Date - Aug 04 , 2024 | 08:50 PM