Home » Kesineni Chinni
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విజయవాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెజవాడలో సీఎం జగన్ పర్యటన ప్లాప్ అయ్యిందని వివరించారు. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు గులకరాయి డ్రామా ఆడారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రిపై రాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తుపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని (శివనాథ్) తెలిపారు. ముఖ్యమంత్రి వెళ్లే మార్గంలో కరెంటు ఎందుకు కట్ చేశారో ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదన్నారు. రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్ వైసీపీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపుకు వచ్చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 13న 'నిజం గెలవాలి' ముగింపు సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ అధినేత అరెస్ట్తో మనస్థాపం చెందిన కుటుంబాలను ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పరామర్శించారు. ఇప్పటి వరకు భువనమ్మ 8,500 కిలోమీటర్లు ప్రయాణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు వారికి ఆర్థిక సాయం అందజేశారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. పలువురు ముఖ్య నేతలతో పాటు యువత కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా నగరంలోని భవానీపురం, విద్యాదరాపురం, గుణదల ప్రాంతాల నుంచి భారీగా యువత పార్టీలో చేరారు. టీడీపీ నేత కేశినేని చిన్ని సమక్షంలో యువత పార్టీ కండువా కప్పుకుంటున్నారు.
వైసీపీ (YSRCP) నేతలు ఓటమి భయంతో ఫ్రస్టేషన్లో దాడులకు దిగుతున్నారని విజయవాడ తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని(Kesineni Chinni) అన్నారు. మంగళవారం నాడు నందిగామలో వైసీపీ గుండాల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు కిషోర్, నరసింహారావులను ఆంధ్రా హాస్పిటల్లో ఆ పార్టీ నాయకులు కేశినేని చిన్ని, నెట్టం రఘురామ్, కార్యకర్తలు పరామర్శించారు.
సీఎం జగన్( CM Jagan) ఆలోచన వల్ల ఏపీ దివాళా తీసిందని మైలవరం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. మైలవరం చలవాది కళ్యాణ మండపంలో శంఖరావం కార్యక్రమంపై సోమవరాం నాడు తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని) హాజరయ్యారు.
Andhrapradesh: తూర్పు నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణదలలో కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ పర్యటించారు. అమ్మ కళ్యాణ మండపం వద్ద కేశినేని చిన్నికి, గద్దె రామమోహన్కు స్థానికులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో తెలుసునని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని(Kesineni Chinni) అన్నారు. తన సేవా కార్యక్రమాలు, రాజకీయ జీవితం ప్రారంభం అయ్యింది తిరువూరులోనేనని చెప్పారు. ఈ ధూం...ధాం సభ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది టీడీపీ విజయోత్సవ సభలాగా ఉందన్నారు. ఇక్కడ మీ అభిమానం, ఆదరణ చూస్తుంటే గెలుపు ముందే వచ్చినట్లుగా ఉందని చెప్పారు.
కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు టీడీపీ - జనసేన - బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్(Phones Tapping) చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమ (Bonda Uma) తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఆధారాలను బయట పెట్టారు.
Kesineni Chinni Vs Nani: కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని (Kesineni Chinni) ఏడాది క్రితం వరకు టీడీపీలో కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. కానీ ఏడాది నుంచి ఆయన పేరు విజయవాడ పార్లమెంటు ప్రజలకు సుపరిచితమైపోయింది..