Share News

Kesineni Sivanath: తిరువూరులో కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు.. ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 06 , 2024 | 01:42 PM

తిరువూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ బ్యూరో సభ్యులు బలరామయ్య, గుంటూరు కృష్ణా జిల్లాల సమన్వయకర్త సత్యనారాయణ రాజు, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలువురు టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.

Kesineni Sivanath: తిరువూరులో కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు..  ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు

అమరావతి: తిరువూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ బ్యూరో సభ్యులు బలరామయ్య, గుంటూరు కృష్ణా జిల్లాల సమన్వయకర్త సత్యనారాయణ రాజు, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలువురు టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ... తిరువూరు పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం నేతలతో నిన్న(శనివారం) జరిగిన సమావేశం మంచి ఫలితాన్ని ఇచ్చిందని తెలిపారు. గత పది రోజులుగా జరిగిన ఘటనలపై చర్చించామని చెప్పారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని... ఆయనకు అండగా నిలవాలని అన్నారు.


సమన్వయ లోపం కారణంగా తిరువూరులో కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. అధిష్టానం ఏది చెబితే కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు అదే పాటిస్తారని అన్నారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పారు. ఇవాళ జరిగే సమావేశంతో వివాదానికి తెరపడే అవకాశం కనబడుతుందని తెలిపారు. తమ మనోభావాలు కంటే పార్టీ ఆదేశాలే తమకు శిరోధార్యమని అన్నారు. కార్యకర్తలు, నాయకులకు కొంత బాధ ఉన్నప్పటికీ సర్దుకుపోయే మనస్తత్వం టీడీపీ కేడర్‌కి ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.

Updated Date - Oct 06 , 2024 | 01:42 PM