Share News

Budda Venkanna: నా మాట ఆవేదనతోనే.. వ్యతిరేకతతో కాదు.. బుద్దా కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 03 , 2024 | 11:25 AM

Andhrapradesh: ఎంపీ కేశినేని పుట్టిన రోజు వేడుకులను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేక్ కట్ చేసి వెంకన్నకు తినిపించారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ... పదవి లేక పోవడంతో ప్రజలకు, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందన్నారు.

Budda Venkanna: నా మాట ఆవేదనతోనే.. వ్యతిరేకతతో కాదు.. బుద్దా కీలక వ్యాఖ్యలు
Budda Venkanna

అమరావతి, ఆగస్టు 3: ఎంపీ కేశినేని చిన్ని(MP Kesineni Chinni) పుట్టిన రోజు వేడుకులను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేక్ కట్ చేసి వెంకన్నకు తినిపించారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ... పదవి లేక పోవడంతో ప్రజలకు, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందన్నారు. ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలుగా నియమించారన్నారు.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలనం


‘‘నా మాట చెల్లటంలేదు.. ఆవేదనగా ఉంది...ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డాను. ఇంకా నన్ను నమ్ముకున్న వారికి నేనేమీ చేస్తాను. నన్ను కార్యకర్తలు క్షమించాలి. 2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్రబాబు నాయుడు చిత్రపటం కాళ్ళు కడిగాను. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ వెళితే నేను వెళ్లి అడ్డుకుని నిలబడ్డా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు అప్పుడు వచ్చారో చెప్పాలి’’ అనిఅన్నారు. ఐదేళ్ల వైసీపీ దుర్మార్గపు పాలనలో అనేక పోరాటాలు చేశామన్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడినట్లు తెలిపారు. తన మీద మొత్తం 37 కేసులు పెట్టారు టీడీపీ పార్టీ కోసమే పెట్టించుకున్నానన్నారు.

YSRCP: బొత్స ఎంపికపై వైసీపీ నేతల్లో గరంగరం!


టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగలేదని భావిస్తున్నానని... ఈ మాట ఆవేదనతోనే చెబుతున్న తప్ప వ్యతిరేకతతో కాదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి, ఎదురు తిరిగి టీడీపీలో టికెట్లు పొందారన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశా అని.. అయితే ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నానన్నారు. కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో ఉన్నానన్నారు. 2029 ఎన్నికల్లో పోరాటం చేసైనా టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్టు సాధిస్తానని.. ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు. ‘‘నేను చచ్చిపోయే వరకు టీడీపీలోనే ఉంటా. నా ఆవేదనను కేశినేని చిన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి’’ అని బుద్దా వెంకన్న కోరారు. .

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎక్కడ..!?


అధైర్యపడొద్దు: ఎంపీ చిన్ని

ఎంపి కేశినేని చిన్ని మాట్లాడుతూ.. పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బిజెపికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆ విషయం తనకు తెలుసని.. దీన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళతానన్నారు. త్వరలోనే బుద్ధ వెంకన్న, నాగుల్ మీరాకు కూడా మంచి పదవులు వస్తాయని అన్నారు. కార్యకర్తలు, నాయకులు ఏమాత్రం అధైర్య పడవద్దని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Gold Rates: 70 వేల మార్క్ చేరిన బంగారం ధర

Tungabhadra: తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తివేత.. అధికారుల హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 03 , 2024 | 11:45 AM