Kesineni Chinni: చంద్రబాబు మార్క్ అంటే ఇది.. చిన్ని కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 03 , 2024 | 06:44 PM
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) వ్యాఖ్యానించారు. కేవలం 40 రోజుల్లోనే అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేంద్రం అందించిందని.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మార్క్ అని ఉద్ఘాటించారు.
విజయవాడ: కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) వ్యాఖ్యానించారు. కేవలం 40 రోజుల్లోనే అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేంద్రం అందించిందని.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు మార్క్ అని ఉద్ఘాటించారు. మహానాడు రోడ్డు నుంచి నిడమనూరు వరకు ఫ్లై ఓవర్, ఈస్ట్ బైపాస్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఆరు లైన్ల ఫ్లై ఓవర్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందని వివరించారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రూ.2500 కోట్ల తో తూర్పు బైపాస్‌కు కూడా త్వరలో పరిపాలనా అనుమతులు రాబోతున్నాయని స్పష్టం చేశారు. వీటి నిర్మాణాల కోసం పరిపాలన అనుమతులు కేంద్రం మంజూరు చేసిందని గుర్తుచేశారు. త్వరలోనే తూర్పు బైపాస్ డీపీఆర్‌ను జాతీయ రహదారి అధికారులు సిద్ధం చేస్తున్నారని వివరించారు.
మూడేళ్ల కాలపరిమితిలో ఈస్ట్ బైపాస్ పూర్తి చేస్తామని అన్నారు. మహానాడు, నిడమనూరు మధ్య ఆరు వరుసల ఫ్లై ఓవర్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. డీపీఆర్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారన్నారు. ఇది రెండేళ్ల కాలపరిమితిలో పూర్తి చేస్తామని వివరించారు. నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అమృత్ పథకం కింద విజయవాడ రైల్వేస్టేషన్ పరిగణించారని చెప్పారు. నిధులు త్వరలోనే విడుదల అవుతాయని తెలిపారు. రేడియల్ రోడ్లను కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అమరావతికి రైల్వే లైన్ రావడం సంతోషకరమని కేశినేని చిన్ని పేర్కొన్నారు.
త్వరలో కొత్త చట్టం తెస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు
మరోవైపు.. సహకార వ్యవస్థలో ఈ-కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) తెలిపారు. ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేసి.. త్వరలో కొత్త చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి కౌలు రైతుకు న్యాయం జరగాలని తెలిపారు.
వ్యవస్థలో మార్పు రావాలి..
కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు ఇస్తామని అన్నారు. నేటి నుంచే వ్యవస్థలో మార్పు రావాలి.. లోపాలు సరిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సహకార సంఘాల్లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలపై విచారణ చేయిస్తామని హెచ్చరించారు. ఆప్కాబ్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభిస్తారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.