Home » Kesineni Nani
Andhrapradesh: నీతినిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4యేళ్ల 9నెలలు అయ్యిందని.. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని ఎంపీ కేశినేని నాని అన్నారు.
విజయవాడ: కోవిడ్ తరువాత పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందివ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఙతలు తెలుపుతున్నానని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు.
Andhrapradesh: రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులు కొత్త కాదన్నారు.
తెలుగుదేశం..మీసం తిప్పుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పార్లమెంటులో గళమెత్తిన టీడీపీ ఎంపీలకు అభినందనలు తెలిపారు. ఢిల్లీలో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. చంద్రబాబుని తప్పుడు కేసులో అక్రమ అరెస్టు చేయించిన సైకో జగన్ తీరుపై దేశమంతా చర్చకు వచ్చేలా చేసిన టీడీపీ ఎంపీలను నారా లోకేశ్ అభినందించారు.
వైసీపీ ప్రభుత్వం(YCP Govt) కక్షపూరితంగా నేడు చంద్రబాబును అరెస్ట్(Chandrababu arrested) చేయడం భారతదేశ చరిత్రలో చీకటి రోజు, దుర్ధినమని టీడీపీ ఎంపీ కేశినేని నాని(TDP MP Keshineni Nani) అన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు.
తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
టీడీపీ అధినేత చంద్రబాబు దేశ రాజకీయాల్లోనే నిజాయితీ కలిగిన వ్యక్తి అని.. అవినీతి మచ్చ లేని నాయకుడు అని ఎంపీ కేశినేని నాని కొనియాడారు. నోటీసులు పెద్ద విషయం కాదని.. దానికి వివరణ ఇస్తారని.. ఇవన్నీ తాత్కాలికమేనన్నారు.
మీడియా తీరుపై ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఈ నెల 28 న ఢిల్లీలో జరగనున్న ఎన్టీఆర్ కాయిన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు. అర్హత ఉన్న వారి ఓట్లను తొలగించడం చాలా తప్పని అన్నారు. ఒక వర్గం, ఒక పార్టీ వారిగా గుర్తించి ఓట్లు తొలగించడం కరెక్టు కాదన్నారు.
శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రం బాగుపడదని విజయవాడ టీడీపీ కేశినేని నాని (Keshineni Nani) అభిప్రాయపడ్డారు. రైతులకు సబ్సిడీపై మూడో విడత ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. టీడీపీ ఎంపీలతో కలిసి సోమవారం పార్లమెంట్లో ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు.