Home » Kishan Reddy G
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్ అనాథలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి విమర్శించారు. జీహెచ్ఎంసీ, జలమండలిలో నిధులు లేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
బల్కంపేట ఎల్లమ్మతల్లి(Balkampet Yellamma) కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కల్యాణాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచీ పెద్దఎత్తున భక్తులు, ప్రముఖులు తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామీఅమ్మవార్లను అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ(Minister konda surekha) దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆలయానికి చేరుకున్నారు.
వ్యాక్సిన్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ను ప్రపంచ ఫార్మా సిటీగా మార్చేందుకు ఔషధ తయారీ సంస్థలకు అన్ని రకాల సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా ఈ నెల 9వ తేదీన ధర్నాకు పిలుపునిచ్చింది.
ఒడిసాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనిలో తవ్వకాలకు మార్గం సుగమమైంది. కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్పందించిన ఒడిసా సర్కారు ఇటీవల అటవీ అనుమతులు మంజూరు చేసింది.
తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది.
ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు.
కేంద్ర క్యాబినెట్ కమిటీల(Central Cabinet committees) సభ్యులుగా తెలుగు కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu), కిషన్ రెడ్డి(Kishan Reddy)కి అవకాశం దక్కింది. పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీల్లో సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు నియామకం అయ్యారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కిషన్ రెడ్డికి చోటు దక్కింది.
ప్రైవేటు భాగస్వామ్యం, సాంకేతిక పురోగతి ద్వారా సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఉద్యోగాల కల్పన, ఎగుమతులు పెంచడం, ప్రపంచంతో మన దేశం పోటీపడటానికి ప్రైవేటు పెట్టుబడులు, వినూత్న ఆలోచనలు కీలకమైనవని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఇకలేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు.