Central Cabinet: కేంద్ర క్యాబినెట్ కమిటీల్లో తెలుగు కేంద్రమంత్రులకు అవకాశం..
ABN , Publish Date - Jul 03 , 2024 | 06:47 PM
కేంద్ర క్యాబినెట్ కమిటీల(Central Cabinet committees) సభ్యులుగా తెలుగు కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu), కిషన్ రెడ్డి(Kishan Reddy)కి అవకాశం దక్కింది. పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీల్లో సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు నియామకం అయ్యారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కిషన్ రెడ్డికి చోటు దక్కింది.
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కమిటీల(Central Cabinet committees) సభ్యులుగా తెలుగు కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu), కిషన్ రెడ్డి(Kishan Reddy)కి అవకాశం దక్కింది. పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీల్లో సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు నియామకం అయ్యారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఇక అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్‌లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఉన్నారు.
కేంద్ర క్యాబినెట్‌లో వేర్వేరు కమిటీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ ఎఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ ఎఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ గ్రోత్, క్యాబినెట్ కమిటీ ఆన్ స్కిల్, ఎంప్లాయిమెంట్ అండ్ లైవ్లీహుడ్ కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది. తెలుగు కేంద్ర మంత్రులకూ అవకాశం దక్కడంతో పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు.. కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కుడా చదవండి:
Free Sand Policy: గుడ్ న్యూస్.. ఏపీలో ఇకపై ఉచితంగా ఇసుక..
T.G. Bharath: అశోక్ లేలాండ్ కంపెనీ పారిపోయే పరిస్థితి తెచ్చారు: మంత్రి టీడీ భరత్