Home » KL Rahul
టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. సెలక్టర్లు భారత జట్టుని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులోగా జట్టుని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. మాజీ ఆటగాళ్లు జట్టులో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? ఎవరిని ఏ స్థానంలో దింపాలి?
ఐపీఎల్-2024 ప్రారంభంలో కాస్త తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ముఖ్యంగా.. ఏప్రిల్ 19వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు.
యువ బౌలర్ యశ్ ఠాకూర్ ఓ సంచలన రికార్డ్ సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్‌గా అవతరించాడు.
రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు జట్టుపై టార్గెట్ ఛేజింగ్‌లో రాజస్థాన్ రాయల్స్స్టా ర్ ప్లేయర్ జాస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. 58 బంతుల్లోనే శతకాన్ని బాది తన జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లాడు. 9 ఫోర్లు, 4 సిక్సర్లతో ఐపీఎల్ కెరియర్లో మరో సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో 100వ మ్యాచ్‌లో సెంచరీని బాదిన ఆటగాడిగా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఈ రికార్డును బట్లర్ పంచుకున్నాడు.
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ బోణీ చేసింది. లక్నోసూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో గెలిచింది. సంజూ శాంసన్(82) భారీ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్‌లో రాజస్థాన్ 193/4 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నోసూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుత కీపింగ్ ఆకట్టుకుంటుంది. గాయం తర్వాత కోలుకుని జట్టులోకి వచ్చిన వెంటనే రాహుల్ అద్భుత కీపింగ్ నైపుణ్యం ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్‌కు గుడ్ న్యూస్. పూర్తి ఫిట్‌గా మారిన ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ త్వరలో జట్టుతో పాటు కలవబోతున్నాడు.
ఆల్‌రౌండ్ కృనాల్ పాండ్యాకు లక్నోసూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ షాకిచ్చింది. వైస్ కెప్టెన్‌గా అతని స్థానంలో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను నియమించింది. ఈ మేరకు లక్నోసూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటించింది.
భారత్, ఇంగ్లండ్ మధ్య (India vs England) 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన ధర్మశాల టెస్టుకు (Dharmasala Test) 15 మందితో కూడిన జట్టుని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్.
గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన గత మూడు టెస్టులకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. రాహుల్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరిగే చివరి టెస్ట్ మ్యాచ్‌కు కూడా రాహుల్ దూరమయ్యే అవకాశం ఉంది.