KL Rahul-Kohli: ఎంత నచ్చజెప్పినా కోహ్లీ వినలేదు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 09:54 AM
Champions Trophy Semi Final 2025: అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని మరోమారు నిరూపించాడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. సన్నింగ్ నాక్‌తో చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

భారత జట్టు పగ తీర్చుకుంది. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్‌లో తమను ఓడించిన ఆస్ట్రేలియా మీద రివేంజ్ తీర్చుకుంది రోహిత్ సేన. చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా కంగారూలతో జరిగిన సెమీఫైనల్‌లో మెన్ ఇన్ బ్లూ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మరో 11 బంతులు ఉండగానే మ్యాచ్‌ను ముగించి అభిమానులను సంబురాల్లో ముంచెత్తింది. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (84), శ్రేయస్ అయ్యర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్).. బౌలింగ్‌లో మహ్మద్ షమి (3/48), రవీంద్ర జడేజా (2/40), వరుణ్ చక్రవర్తి (2/49) అదరగొట్టారు. అయితే అంతా బాగానే ఉన్నా కోహ్లీ సెంచరీ చేయలేకపోయాడనే బాధ ఫ్యాన్స్‌ను కొంత బాధిస్తోంది. దీనిపై రాహుల్ రియాక్ట్ అయ్యాడు. తాను ఎంత నచ్చజెప్పినా విరాట్ మాట వినలేదన్నాడు. కేఎల్ ఇంకా ఏమన్నాడంటే..
కొట్టేస్తాననే ధీమాతో..
‘నేను క్రీజులో రాగానే కోహ్లీతో కాసేపు మాట్లాడా. నువ్వు ఆఖరి వరకు క్రీజులోనే ఉండాలని అతడి చెప్పా. నువ్వు ఒక ఎండ్‌లో నిలబడితే.. నేను మరో ఎండ్‌లో రిస్క్ తీసుకొని షాట్లు కొడతానన్నా. సెట్ బ్యాటర్ కాబట్టి విరాట్ క్రీజులో ఉండటం టీమ్‌కు ముఖ్యం. దీంతో ఇదే విషయం అతడికి చెప్పా. నేను ప్రతి ఓవర్‌లో రిస్క్ తీసుకొని ఆడతానని వివరించా. కానీ అతడు హిట్టింగ్‌కు వెళ్లాడు. జంపా వేసిన బాల్ తన ఆర్క్‌లో ఉంది కొట్టేస్తానని అనుకున్నాడు. షాట్ కనెక్ట్ అవుతుందనే నమ్మకంతోనే అతడు బాదాడు’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. కాగా, విరాట్ ఔట్ అవగానే ‘నేను కొడుతున్నా కదా..’ అంటూ నిరాశకు లోనయ్యాడు రాహుల్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ సీరియస్
ఇక కంగారు పోయింది టైటిల్ మిగిలింది
డ్రెస్సింగ్ రూమ్‌లోకి కుటుంబ సభ్యులకు నో ఎంట్రీ!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి