Share News

KL Rahul: మజాక్ అనుకుంటున్నావా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్

ABN , Publish Date - Mar 11 , 2025 | 03:25 PM

Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రా భార్యకు స్వీట్ కౌంటర్ ఇచ్చాడు కేఎల్ రాహుల్. అంత ఈజీనా అంటూ ఆమె అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ఇంతకీ వీళ్ల మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

KL Rahul: మజాక్ అనుకుంటున్నావా.. బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్
KL Rahul

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ ఓటమికి కారణమంటూ అప్పట్లో రాహుల్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాధను పంటి కింద భరిస్తూ వచ్చిన భారత స్టార్.. ఎట్టకేలకు ఒక్క టోర్నమెంట్‌తో అన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో అటు కీపింగ్, ఇటు బ్యాటింగ్‌లో అదరగొట్టి కొత్త హీరోగా అవతరించాడు. అందరి నుంచి ప్రశంసలు అందుకున్న ఈ బ్యాటర్.. పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా భార్యకు కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అసలు వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


అదిరిపోయే రిప్లయ్

చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిశాక భారత ఆటగాళ్లంతా సంబురాల్లో మునిగిపోయారు. కప్పు నెగ్గిన సంతోషంలో ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ తరుణంలో రాహుల్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగింది బుమ్రా సతీమణి, టీవీ ప్రెజెంటర్ సంజనా గణేషన్. నెట్స్‌లో స్పిన్నర్లతో కలసి వర్క్ చేయడం, కీపింగ్ చేయడం ఎంత ఫన్నీగా ఉంటుందో చెప్పండి అంటూ కేఎల్‌ను క్వశ్చన్ చేసింది బుమ్రా వైఫ్. అయితే ఊహించని ప్రశ్నకు రాహుల్ అదిరిపోయే జవాబు ఇచ్చాడు. కీపింగ్ చేయడం అంత ఈజీనా సంజనా అంటూ స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో 200 నుంచి 250 సార్లు స్క్వాట్స్ చేయాల్సి ఉంటుందన్నాడు. మోకాళ్లపై అన్నిసార్లు కూర్చోవడం అంత ఈజీ కాదని.. ఇది ఫన్ కాదంటూ స్వీట్ కౌంటర్ ఇచ్చాడు.


వాళ్లతో డేంజర్

భారత స్పిన్నర్లంతా టాప్ క్లాస్ బౌలర్లంటూ మెచ్చుకున్నాడు రాహుల్. పిచ్‌ల నుంచి మద్దతు దొరికితే వాళ్లు నెక్స్ట్ లెవల్‌లో బౌలింగ్ చేస్తారని ప్రశంసించాడు. వికెట్ నుంచి స్పిన్ లభిస్తే వాళ్లు డేంజరస్‌గా మారతారని పేర్కొన్నాడు రాహుల్. ఆ సమయంలో స్టంప్స్ వెనుక ఉండి బంతుల్ని అందుకోవడం మామూలు విషయం కాదన్నాడు. దుబాయ్ కండీషన్స్‌ను మన స్పిన్నర్లు వాడుకున్న తీరు అద్భుతమని చెప్పుకొచ్చాడు.



ఇవీ చదవండి:

ట్రోఫీ సెర్మనీకి పాక్ డుమ్మా.. తెగ్గొట్టిన ఐసీసీ

నా నెక్స్ట్ టార్గెట్ అదే: రోహిత్

చాంపియన్స్ ట్రోఫీ హీరో.. ధీనగాథ తెలిస్తే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2025 | 04:55 PM