Home » Kodangal
రాష్ట్రంలో పలు ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన అథారిటీల పరిధిలోని వివిధ శాఖల కార్యాలయాలు మరో ప్రాంతానికి మారబోతున్నాయి.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దౌల్తాబాద్ మండల రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్ద గోడు వెల్లబోసుకున్నారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రెండు ప్యాకేజీలుగా విడగొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి ఈనెల 9వ తేదీన టెండర్లు పిలవనున్నారు.
మజ్లిస్ నేత అక్బరుద్దీన్‌కు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సవాల్ చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటికో ఇన్చార్జిగా ఉండి ఆయనకు డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తామని చెప్పారు.
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి తక్షణమే టెండర్లు పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ పథకం పురోగతిపై ప్రతి మూడు లేదా నాలుగు వారాలకోసారి తాను సమీక్ష చేస్తానని చెప్పారు.
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు, నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాలను తీర్చడానికి వీలుగా ఈ పథకాన్ని నిర్మించనుంది.
దేశంలో ప్రధాని మోదీకి వ్యతిరేక వేవ్ నడుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు కాంగ్రె్‌సకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. సోమవారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, భార్య గీతారెడ్డి, కుమార్తె నైనీశారెడ్డితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లో కుటుంబసమేతంగా సీఎం రేవంత్ ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ ఎన్నికల్లో అంతకు మించివస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తమ వందరోజుల పాలనకు రెఫరెండమని తెలిపారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు.