Share News

‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:15 AM

లగచర్లలో కలెక్టర్‌, ఉన్నతాధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

 ‘లగచర్ల'  దాడిని  తీవ్రంగా పరిగణిస్తున్నాం

  • బాధ్యుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: దుద్దిళ్ల

  • దాడి చేసినా ఊర్కోవాలా?: పొన్నం

  • కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లే సూత్రధారులు

  • ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, యాదయ్య

  • రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దా?:అన్వే్‌ష్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): లగచర్లలో కలెక్టర్‌, ఉన్నతాధికారులపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడతామన్నారు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు అధికారులు రైతుల వద్దకు వెళ్లకుండా పథకం ప్రకారమే కొందరు వ్యక్తు లు దాడి చేశారని తెలిపారు. సీఎల్పీ మీడియా హాల్లో మంగళవారం మీడియా సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘లగచర్ల గ్రామానికి కలెక్టర్‌ను రమ్మ ని చెప్పింది, దాడి చేసింది ఎవరు? ఈ దాడుల వెనక కుట్రదారులు ఎవరున్నారు? అన్న విషయాలపై కచ్చితంగా విచారణ జరుపుతాం. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డు తగిలే వారిని, రౌడీయిజం చేసి, ప్రభుత్వ అధికారులను బెదిరించే వారిని ఉపేక్షించం. బాధ్యు ల్ని వదలం’’ అని చెప్పారు.

రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా ఎవరు కుట్ర చేస్తున్నారన్నదీ బయటపెడతామన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు గ్రూప్‌ 1 పరీక్షనూ అడ్డుకునే ప్ర యత్నం చేశారని ఆరోపించారు. కేటీఆర్‌ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. ‘‘బీఆర్‌ఎస్‌ నేతలు ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడుతున్నారు. ప్రజలకు మేం చేసిన అన్యాయం ఏంటి? రుణమాఫీ చేయడం, ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, ఉచిత కరెంట్‌ ఇవ్వడం, 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం ప్రభు త్వం చేసిన తప్పా?’’ అని మంత్రి నిలదీశారు. జిల్లా కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి, వేరే ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. కలెక్టర్‌పై దాడి జరిగినా ఊరుకోవాలా? అని నిలదీశారు. కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించిన వ్యక్తి వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తనపై వస్తున్న ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. కాగా, లగచర్లలో కలెక్టర్‌, అధికారులపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కోరారు. బీఆర్‌ఎస్‌ నేత సురేశ్‌.. కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి లగచర్ల గ్రామానికి తీసుకెళ్లాడన్నారు.


  • రూ.కోటి ఇచ్చి దాడులు చేయించారు

లగచర్లలో అధికారులపై దాడికి ప్రోత్సహించింది బీఆర్‌ఎస్‌ నేతలేనని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు.. ప్రజలకు ఉపాధి దొరకొద్దు అన్నది బీఆర్‌ఎస్‌ వైఖరా? అని కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి నిలదీశారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే రైతుల ముసుగులో బీఆర్‌ఎస్‌ నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో కులగణన సర్వేను అడ్డుకునేందుకు కేటీఆర్‌, హరీశ్‌ కుట్ర చేస్తున్నారని, వారిని నిలదీయాలని ఓబీసీలు, బహుజనులకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ పిలుపునిచ్చారు. లగచర్లకు చెందిన బీఆర్‌ఎస్‌ నేత సురేశ్‌కు ఆ పార్టీ కీలక నేతలు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఇచ్చి, అధికారులపై దాడులు చేయించారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మె ల్యే కాలె యాదయ్య ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ల పాత్ర ఉంద న్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదని, అధికారులు, ఉద్యోగులపై దాడులు చేసి, వారి మనో స్థైర్యాన్ని దెబ్బ తీయొద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ జి.చిన్నారెడ్డి అన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 05:16 AM