Home » Kolkata
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై దాడి కేసులో నిందితుడు షేక్ షాజహాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం సాయంత్రం 4.30 గంటల కల్లా అప్పగించాలని పశ్చిమబెంగాల్ సీఐడీని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సీఐడీకి కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ చేసింది.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలతో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
బెంగాల్ టీచర్స్ కుంభకోణంతో సహా పలు అంశాల్లో కీలకమైన తీర్పులు చెప్పిన కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ మంగళవారంనాడు తన పదవికి రాజీనామా చేశారు. మార్చి 7వ తేదీన బీజేపీలోకి చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈడీ అధికారులపై దాడికి సంబంధించిన సందేశ్‌ఖాలి ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ కోల్కత్తా హైకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. దాడి కేసు నిందితుడుషేక్ షాజహాన్ ను మంగళవారం మధ్యాహ్నం 4.30 గంటల కల్లా సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
కోల్ కతా డమ్ డమ్ ఏరియాలో సంహతి పాల్ అనే మేకప్ ఆర్టిస్ట్ ఉంటోంది. ఆమెకు సార్ధక్ దాస్ అనే ఫొటోగ్రాఫర్‌తో వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రోజున సార్ధక్ దాస్‌పై సంహతి పాల్ కత్తితో విచక్షణరహితంగా దాడి చేసింది. దాంతో అతను కుప్పకూలిపోయాడు.
పశ్చిమ్ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ అరెస్టుపై ఎటువంటి స్టే లేదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.
ఆందోళనలతో అట్టుడుకుతున్న నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌కాళి గ్రామంలో పర్యటించేందుకు పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారికి కోల్‌కతా హైకోర్టు సోమవారంనాడు అనుమతి ఇచ్చింది. అయితే, రెచ్చగొట్టే ప్రసంగాలేవీ చేయవద్దని హెచ్చరించింది.
కోల్‌కతా: త్రిపుర నుంచి బెంగాల్ సఫారీ పార్క్ కు తీసుకువచ్చిన ఆడసింహం పేరుపై వివాదం నెలకొంది. ఆడసింహాన్ని 'సీత'గా పిలుచుకుంటున్నారని, వెంటనే పేరు మార్చాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
గుజరాత్‌కు చెందిన గీత అనే వివాహిత కోల్ కతాలో 11 ఏళ్ల క్రితం తప్పిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ కోమాలో ఉన్న గీతకు ఇటీవల సృహ వచ్చింది. తన కుటుంబం వివరాలు చెప్పడంతో అధికారులు వీడియో కాల్ మాట్లాడించారు. గీతతో మాట్లాడటంతో ఆ కుటుంబ సభ్యులు తెగ సంబర పడిపోయారు.
తీవ్ర అస్వస్థతతో ఈనెల 10న కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సోమవారం మధ్యాహ్నం డిశ్చార్చ్ అయ్యారు. మెదడుకు సంబంధించిన ''ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్''తో ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మిథున్...తన అస్వస్థతకు దెయ్యంలా తినడమే కారణమని అన్నారు.