Home » Komati Reddy Venkat Reddy
Telangana: నల్గొండ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని... పేదవాడికి అండగా ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద రూ.3 కోట్లతో నిర్మించనున్న 33/11 కెవీ సబ్ స్టేషన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్గొండ టౌన్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
రోడ్ల పనులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని, జాప్యానికి సాకులు చెప్పొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. రాష్ట్రానికి రహదారులు జీవనాడులని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూడేళ్లుగా కేంద్రం నుంచి అతి తక్కువ నిధులు మంజూరయ్యాయని ఆరోపించారు.
కొత్తగూడెం, మణుగూరులో నేడు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. అమృత్ 2.0 గ్రాంట్‌లో భాగంగా 124.48 కోట్లతో కొత్తగూడెంలో శాశ్వత మంచినీటి పథకం, 4 కోట్లతో విద్యానగర్ హైవే కు డ్రెయిన్ నిర్మాణాలకు శంకుస్థాపన జరగనుంది. కొ
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉంటానని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ భవన్‌ను ఢిల్లీలోనే ఒక ఐకానిక్ టవర్గా నిర్మించబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తాను మంత్రి పదవిని చేపట్టిన మూడో రోజే తెలంగాణ భవన్ నిర్మాణంపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. జూలై తొలి వారంలోనే రేవంత్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న హైవేల నిర్మాణాలతో పాటు వివిధ రహదారుల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేలా చొరవ చూపాలని ‘జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)’ చైర్మన్ సంతో్‌షకుమార్ యాదవ్‌ను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.
గత కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పెండింగ్‌లో ఉన్న 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో (Nitin Gadkari) తెలంగాణ రోడ్లు రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister Komati Reddy Venkata Reddy) ఈరోజు(మంగళవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. తెలంగాణలో ఓటు షేర్ పెంచుకున్నాం.. సుస్థిర పాలన అందిస్తున్నామని అన్నారు.