Share News

Komatireddy: తెలంగాణలో సుస్థిర పాలన అందిస్తున్నాం.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 24 , 2024 | 07:27 PM

కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో (Nitin Gadkari) తెలంగాణ రోడ్లు రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister Komati Reddy Venkata Reddy) ఈరోజు(మంగళవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. తెలంగాణలో ఓటు షేర్ పెంచుకున్నాం.. సుస్థిర పాలన అందిస్తున్నామని అన్నారు.

Komatireddy: తెలంగాణలో సుస్థిర పాలన అందిస్తున్నాం.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Minister Komati Reddy Venkata Reddy

ఢిల్లీ: కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో (Nitin Gadkari) తెలంగాణ రోడ్లు రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister Komati Reddy Venkata Reddy) ఈరోజు(మంగళవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. తెలంగాణలో ఓటు షేర్ పెంచుకున్నాం.. సుస్థిర పాలన అందిస్తున్నామని అన్నారు. 2018 నుంచి రీజనల్ రింగ్ రోడ్ పై చర్చ జరుగుతుంది కానీ ముందుకు కదలడం లేదని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యం అయ్యిందన్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారిగా మార్చాలన్నారు.


రోజుకూ 60 వేల వాహనాలు తిరుగుతాయని, 370 చోట్ల ప్రమాద జోన్లను గుర్తించినట్లు తెలిపారు. త్వరగా హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లైన్ల రహదారి పనులు చేపట్టాలని కోరామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రత్యేక సమావేశం పెడతామని చెప్పారని అన్నారు. రాష్ట్రంలో 16 రోడ్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. నూతన జాతీయ రహదారుల కోసం మరో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉప్పల్ ఘాట్ కేసర్ ఫ్లై ఓ వర్ టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశించామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారన్నారు.


కేంద్రమంత్రి బండి సంజయ్‌ను మర్యాద పూర్వకంగా కలుస్తామని, రేపు కిషన్ రెడ్డిని కలుస్తామని తెలిపారు. భుపెంద్ర యాదవ్‌తో అటవీ పర్యావరణ అనుమతుల గురించి చర్చిస్తామన్నారు. రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరవుతునట్లు తెలిపారు. తాను అభిపవృద్ధి పనుల కోసం వచ్చానని స్పష్టం చేశారు. నేషనల్ హైవే నిధులు ఎక్కువగా తెలంగాణకు ఇవ్వాలని కోరామన్నారు. వచ్చే మూడేళ్ల రీజనల్ రింగ్ రోడ్డు, విజయవాడ హైదరాబాద్ 6 లైన్ల రహదారిని పూర్తి చేస్తామని తెలిపారు.

Updated Date - Jun 24 , 2024 | 07:46 PM