Home » Komati Reddy Venkat Reddy
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సుకన్య ధన్యవాదాలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన ఆమె ఈ మేరకు గురువారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
గత ఐదేళ్లలో రోడ్ల నిర్మాణం జరగకపోవడం వలన రోడ్లు అధ్వాన్నంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వరుసగా ఎన్నికల కోడ్లు రావడంతో పనులన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు.
బై బై బీఆర్ఎస్ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగు నెలలకే రెఫరెండం అని ప్రజల్లోకి వెళ్లి ఓటు శాతం పెంచుకున్నామన్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆవేదనలో, బాధలో ఉన్నారన్నారు. కేసీఆర్ బస్సు ఎక్కి తిరిగినా డిపాజిట్లు కూడా రాలేదన్నారు.
ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.
అమెరికాకు వెళ్లి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావును తాను కలిసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెబుతున్నారని, మతి భ్రమించిన ఆయన్ను వైద్యునికి చూపించడం మంచిదని మాజీ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పడానికి కోమటిరెడ్డి తనపై చేసిన ఆరోపణే ఒక ఉదాహరణ అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ సూచన మేరకు గత నెల 27న ఎమిరేట్స్ విమానంలో దొంగచాటుగా అమెరికా వెళ్లిన హరీశ్‌రావు.. అక్కడే ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కలిశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని ఆయనకు చెప్పి వచ్చారని పేర్కొన్నారు.
ఉద్యమ సమయంలో సాగరహారం.. మిలియన్ మార్చ్, వంటావార్పులకు వేదికైన ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం తెలంగాణ దశాబ్ది సంబురాలు అంబరాన్నంటాయి. వరణుడు కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడా? అన్నట్లుగా గంటపాటు వాన దంచికొట్టినా.. కళాకారుల నృత్యాలు, పోలీసుల ఫ్లాగ్‌మార్చ్ ఆగలేదు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంతమందిని కాపాడటానికి గత సీఎండీ ప్రభాకర్ రావును దొంగచాటుగా అమెరికా వెళ్లి కలిసి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కోమటిరెడ్డికి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో సంచలన విషయాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) బయటపెట్టారు. ఈ కేసు విషయంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మాజీ మంత్రి హరీష్‌రావు దొంగచాటుగా గత సీఎండీ ప్రభాకర్ రావును అమెరికా వెళ్లి కలిసి వచ్చారని ఆరోపించారు.
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 13 సీట్లు గెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి.. ఓ ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.