Share News

T. Harish Rao: కోమటిరెడ్డికి మతి భ్రమించింది..

ABN , Publish Date - Jun 03 , 2024 | 04:37 AM

అమెరికాకు వెళ్లి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావును తాను కలిసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెబుతున్నారని, మతి భ్రమించిన ఆయన్ను వైద్యునికి చూపించడం మంచిదని మాజీ మంత్రి టి.హరీశ్‌ రావు అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పడానికి కోమటిరెడ్డి తనపై చేసిన ఆరోపణే ఒక ఉదాహరణ అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

T. Harish Rao: కోమటిరెడ్డికి మతి భ్రమించింది..

  • అమెరికాలో నేను ప్రభాకర్‌రావును

  • కలిసినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా

  • లేదంటే మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి

  • విదేశీ పర్యటన వివరాలిస్తా.. బహిరంగ చర్చకు సిద్ధం

  • కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు: హరీశ్‌

  • మంత్రి కోమటిరెడ్డికి

  • మతి భ్రమించింది

  • అమెరికాలో ప్రభాకర్‌రావును కలవలేదు

  • రుజువు చేస్తే అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తా: హరీశ్‌ రావు

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): అమెరికాకు వెళ్లి రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావును తాను కలిసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెబుతున్నారని, మతి భ్రమించిన ఆయన్ను వైద్యునికి చూపించడం మంచిదని మాజీ మంత్రి టి.హరీశ్‌ రావు అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పడానికి కోమటిరెడ్డి తనపై చేసిన ఆరోపణే ఒక ఉదాహరణ అని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభాకర్‌రావును తాను కలిసినట్లు రుజువు చేస్తే.. అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయడానికి సిద్ధం అని, రుజువు చేయకపోతే మంత్రి కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని సవాల్‌ విసిరారు.


తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లింది వాస్తవమేనని, అయితే అమెరికా వెళ్లినట్లు ప్రభాకర్‌రావును కలిసినట్లు మంత్రి మాట్లాడటం వాస్తవం కాదన్నారు. ఏ దేశం వెళ్లాను.. ఏ హోటల్‌లో ఉన్నాను.. తదితర వివరాలు ఇవ్వడానికి తాను సిద్ధమని, పాస్‌పోర్ట్‌ సహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు వస్తానన్నారు. విదేశీ పర్యటనకు వెళితే ఎయిర్‌ పోర్టుల్లో ఇమ్మిగ్రేషన్‌ ఇన్‌ అండ్‌ అవుట్‌ వివరాలు ఉంటాయని, కనీస జ్ఞానం లేకుండా ప్రచారం కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనమని హరీశ్‌ రావు విమర్శించారు.

Updated Date - Jun 03 , 2024 | 04:37 AM