Home » Komati Reddy Venkat Reddy
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha)ను అరెస్టు చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేక ఓటుతో మూడు సీట్లు గెలవచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆశ పెట్టుకున్నారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. రేపు(శనివారం) ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు కవిత ఇంటి మీద ఐటీ, ఈడీ, సీబీఐ పోలీసులతో మోదీ, అమిత్ షా దాడి చేయించి అరెస్టు జేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
Telangana: ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని... ఊళ్లకు పోతే నీళ్ల సమస్యలతో కళ్ళలో నీళ్లు వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. డబ్బుల ఆశతో కేసీఆర్, అల్లుడు, కొడుకులు... హైదరాబాద్‌లో టానిక్ షాపులు, ఢిల్లీలో మందు షాపులు, కాళేశ్వరం పేరుతో దోపిడీ చేసి దక్షిణ తెలంగాణను నాశనం చేశారని విమర్శించారు. అందుకే రిజల్ట్ వచ్చిన రోజే కేసీఆర్ నడుము విరగ్గొట్టి దేవుడు శిక్ష వేశారన్నారు.
Telangana: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో బ్రహోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రేవంత్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడలో ఆయన శుక్రవారం మాట్లాడారు.
Telangana: కేసీఆర్ ప్రభుత్వానికి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీష్‌రావు కూడా ఉండడం డౌటే అని ... బీజేపీలోకి పోతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోందన్నారు.
Telangana: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని పటేల్ గూడకు చేరుకున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లింగంపల్లి- ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రైలును ప్రధాని వర్చ్‌వల్‌గా ప్రారంభించారు. దాదాపు రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని.. ఈ విషయంలో ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) అన్నారు. ఆదివారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటించారు.
Telangana: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోవడం దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సాయన్న చనిపోయి ఏడాది అయిందని.. అయిన నాలుగు రోజులకే కూతురు చనిపోవడం బాధాకరమన్నారు. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.
Telangana: ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని... తెలంగాణ రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు నిధులు కేటాయిస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు రోడ్ల భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ పూర్తి అయితే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ 50 శాతం కవర్ అవుతుందని.. హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయిని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ప్రాజెక్టులపై అధికార.. విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పదేళ్లలో ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని పబ్బం గడిపారని ఎద్దేవా చేశారు.