Share News

Komatireddy: అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు

ABN , Publish Date - Feb 23 , 2024 | 12:48 PM

Telangana: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోవడం దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సాయన్న చనిపోయి ఏడాది అయిందని.. అయిన నాలుగు రోజులకే కూతురు చనిపోవడం బాధాకరమన్నారు. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.

Komatireddy: అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు

హైదరాబాద్, ఫిబ్రవరి 23: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nandita) చనిపోవడం దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkatreddy) అన్నారు. సాయన్న చనిపోయి ఏడాది అయిందని.. అయిన నాలుగు రోజులకే కూతురు చనిపోవడం బాధాకరమన్నారు. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారని తెలిపారు. తండ్రి లాగానే జనాలతో కలివిడిగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఆమె మృతి అందరిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. ఏసీపీతో మాట్లాడామని.. సీటు బెల్ట్ పెట్టుకోలేదని తెలిపారని చెప్పారు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా, ఎంపీగా హడావిడిగా కార్యక్రమాలకు పోతుంటామని... అందరూ సీటు బెల్ట్ పెట్టుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 23 , 2024 | 12:48 PM