Komatireddy: మోడీని ఇక్కడ తిడతారు.. అక్కడ కాళ్లు పట్టుకుంటారు.. బీఆర్‌ఎస్‌పై కోమటిరెడ్డి ఫైర్
ABN , Publish Date - Feb 21 , 2024 | 02:54 PM
Telangana: ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని... తెలంగాణ రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు నిధులు కేటాయిస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు రోడ్ల భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ పూర్తి అయితే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ 50 శాతం కవర్ అవుతుందని.. హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయిని అన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని... తెలంగాణ రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) (RRR)కు నిధులు కేటాయిస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) హామీ ఇచ్చినట్లు రోడ్ల భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkatreddy) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ పూర్తి అయితే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ 50 శాతం కవర్ అవుతుందని.. హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయిని అన్నారు. రైల్వే ప్రాజెక్టుకు కూడా హామీ ఇచ్చారని.. ఇక పనులు మొదలవుతాయని తెలిపారు. నల్గొండ రింగ్ రోడ్డుకు రూ.700కోట్లు ఇస్తామని అన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు మోడీని ఇక్కడ తిడతారు అక్కడ కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు.
టచ్ చేసి చూడు...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) భువనగిరి అభివృద్ధికి నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదని.. కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు తేలేని అసమర్థుడని వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తమ ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటున్నారని.. కాంగ్రెస్‌ను టచ్ చేస్తే అప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ (PM Narendra Modi) అపాయింట్ మెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అడిగారని.. త్వరలో మోడీని కలుస్తామని చెప్పారు. సీఆర్‌ఎఫ్ కింద ప్రపోసల్ పంపామని.. రూ.800 కోట్లు విడుదల అవుతున్నాయని తెలిపారు. అవసరం లేకున్నా పంజాబ్, హర్యానాలో డబ్బులు ఖర్చు పెట్టి దుబారా చేశారని మండిపడ్డారు. కేఆర్‌ఎంబీ (KRMB) అంటే ఏంటిదో బీఆర్ఎస్ వాళ్లకు తెలియదన్నారు. కేఆర్‌ఎంబీకి రూ.200 కోట్లు, జీఆర్‌ఎంబీకి రూ.200కోట్లు మెయింటెనెన్స్‌కు ఇస్తామని చెప్పారన్నారు. నీళ్ల విషయంలో నల్లగొండను మోసం చేసినందుకు 11 చోట్ల ప్రజలు ఓడగొట్టారన్నారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు గెలవదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..