Share News

PM Modi: రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Mar 05 , 2024 | 11:48 AM

Telangana: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని పటేల్ గూడకు చేరుకున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లింగంపల్లి- ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్ రైలు‌ను ప్రధాని వర్చ్‌వల్‌గా ప్రారంభించారు. దాదాపు రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు.

PM Modi: రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన  ప్రధాని మోదీ

సంగారెడ్డి, మార్చి 5: రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)పర్యటన కొనసాగుతోంది. మంగళవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులోని పటేల్ గూడకు చేరుకున్న మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లింగంపల్లి- ఘట్‌కేసర్ ఎంఎంటీఎస్ రైలు‌ను ప్రధాని వర్చ్‌వల్‌గా ప్రారంభించారు. దాదాపు రూ.7వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ్ సై (Governor Tamilisai), కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Union Minidter Kishan Reddy), రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి Minister Komatireddy Venkatreddy), కొండా సురేఖ (Minister Konda Surekha), ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) పాల్గొన్నారు.

PM Modi: ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు



మోదీ ప్రారంభించిన అభివృద్ధి పనులు ఇవే...

  • ఎన్‌హెచ్-65లోని పుణే - హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి X రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన రూ.1,298 కోట్లతో 31 కి.మీ.ల 6 లేన్ హైవే విస్తరణకు శంకుస్థాపన.

  • ఎన్‌హెచ్-765Dలో రూ.399 కోట్లతో మెదక్ - ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ ప్రారంభోత్సవం.

  • ఎన్‌హెచ్-765Dలో రూ.500 కోట్లతో ఏల్లారెడ్డి - రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన.

  • జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు (b) పారాదీప్ - హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ 3,338 కోట్లు.. ప్రారంభోత్సవం.

  • ఎన్‌హెచ్-161లోని కంది - రామసానిపల్లె సెక్షన్‌లో రూ.1,409 కోట్లతో 4 వరుసల జాతీయ రహదారికి శంకుస్థాపన.

  • ఎన్‌హెచ్-167 లోని మిర్యాలగూడ - కోదాడ సెక్షన్‌లో రూ.323 కోట్లతో 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ.

  • హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో 103 కి.మీ.ల పొడవున చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్ - II ప్రాజెక్ట్ రూ.1,165 కోట్లు.

  • ఘట్‌కేసర్ - లింగంపల్లి మధ్యన కొత్తగా ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం.

ఇవి కూడా చదవండి..

Jeff Bezos: ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టి జెఫ్ బెజోస్ అగ్రస్థానం

PM Modi: నేను చెన్నై వస్తున్నానంటేనే కొందరికి కడుపు నొప్పి వస్తోంది..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Mar 05 , 2024 | 11:57 AM