Home » Komati Reddy Venkat Reddy
క్రెడాయ్ స్టేట్ కాన్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెషన్ సెంటర్ లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ స్టేట్‌కాన్- 2024 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి భూ సేకరణ ప్రక్రియను సెప్టెంబరు 15 కల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.
నిర్మల్ జిల్లా, తానుర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ అనే చిన్నారి తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన దీనగాథ గురించి సమాచార మాధ్యమాల్లో చూసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చలించిపోయారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనులను రెండేళ్లలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. వరసగా కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రానికి రావాలని, పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక వసతులు కల్పిస్తామని, రాయితీ ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అమెరికా పర్యటనలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో తొలిరోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది.
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. నత్తనడకన సాగుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్‌కు త్వరలో మోక్షం లభించనుంది. 20 నెలల్లో పనులు పూర్తి చేస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌ను ఏడాదిన్నరలోగా పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. పాత కాంట్రాక్టును రద్దు చేసి, దసరాలోగా కొత్త టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
ఉప్పల్ ఫ్లైఓవర్‌ను 6 ఏళ్లు అయిన పూర్తి చేయకపోవడం ప్రజలకు అవమానకరమని తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి హైదరాబాద్ విశ్వనగరం చేస్తున్నామని అన్నారని.. కానీ 6 ఏళ్లు అయిన ఉప్పల్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
‘నేను అమెరికా వెళ్లి ఈనెల 11న తిరిగొస్తా.. ఈలోగా అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి’ అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.