Home » KTR
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన పరువు, ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా మాట్లాడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నాంపల్లి కోర్టుకు తెలిపారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి ప్రత్యేక కోర్టును ఈ సందర్బంగా కేటీఆర్ అభ్యర్థించారు. ఈ సందర్బంగా కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది.
నాంపల్లి కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిగింది. అందులోభాగంగా కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఆమె ఇలాంటి వాఖ్యలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. సమాజంలో తనకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని.. అయితే వాటిని దిగజార్చాలానే ఆమె ఈ తరహా వాఖ్యలు చేసిందని కోర్టుకు కేటీఆర్ విన్నవించారు.
Telangana: కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. నువ్వేమైన సుద్దపూసవనుకుంటున్నావా.. నీ భాగోతం అందరికీ తెలుసు అంటూ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు. తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రధాని ఆదేశాలనుసారమే రేవంత్ నడుచుకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. బడేభాయ్ ఆజ్ఞలను సీఎం రేవంత్ తూచా తప్పకుండా పాటిస్తున్నారని అన్నారు. అదాని సంతృప్తి కోసం సీఎం ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్.. మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ కేటీఆర్ స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. గత విచారణ సందర్భంగా కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
‘‘పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో.. పరుగులు పెట్టిన తెలంగాణకు అసమర్థ, అవినీతిపాలన శాపంగా మారింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ ఒక బేవకూఫ్ అని అన్నారు.
Telangana: మాజీ మంత్రి కేటీఆర్‌ను బాయిలర్ కోడితో పోల్చారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ‘‘ కేటీఆర్ బాయిలర్ కోడి.. మేము నాటు కోటి. కేటీఆర్‌ను కేసీఆర్ నాజూగ్గా పెంచారు’’ అంటూ సెటైర్ వేశారు. అంతేకాకుండా కేటీఆర్ రాజకీయం నేర్చుకోవాలంటే రేవంత్ వద్ద వెళ్లొచ్చు అంటూ కౌంటర్ ఇచ్చారు.
ప్రజలను మభ్యపెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.