Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసుపై బండి సంజయ్ ఘాటు జవాబు
ABN , Publish Date - Oct 23 , 2024 | 01:14 PM
Telangana: కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. నువ్వేమైన సుద్దపూసవనుకుంటున్నావా.. నీ భాగోతం అందరికీ తెలుసు అంటూ కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్, అక్టోబర్ 23: తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కేంద్రమంత్రి బండిసంజయ్‌కు (Union Minister Bandi Sanjay) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) లీగల్ నోటీసు పంపిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ లీగల్ నోటీసుపై కేంద్రమంతి ఘాటైన జవాబిచ్చారు. ‘‘తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా.. విమర్శలకు నోటీసులే సమాధానమా.. అయితే నీకు నోటీసులు పంపుతా... కాచుకో. నువ్వు సుద్దపూస అనుకుంటున్నవా.. నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన. మాటకు మాట... నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తా’’ అంటూ స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు.
Rahul Gandhi: ప్రియాంక ర్యాలీలో రాహుల్ ఏం చేశారో చూడండి..
మాజీ మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూసినట్లు తెలిపారు. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందని... తాటాకు చప్పళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తనపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే అని చెప్పుకొచ్చారు. అందుకు బదులుగానే మాట్లాడినట్లు తెలిపారు. ఆయన సుద్దపూస అనుకుంటున్నాడేమో.. ఆయన భాగోతం ప్రజలకు తెలుసు అంటూ అంటూ కేటీఆర్‌పై సెటైర్ విసిరారు.
Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. ఈ రెండు రోజులు జాగ్రత్త..
ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసన్నారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చానని.. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తానని వెల్లడించారు. ‘‘ మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం... చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళతాం’’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్రమంత్రి బండి సంజయ్ పత్రికా ప్రకటనను విడుదలచేశారు.
కేటీఆర్ లీగల్ నోటీసు ఇదే..
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని .. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. అక్టోబర్ 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డానని నిరాధారణ ఆరోపణలు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా కేంద్రమంత్రి ప్రస్తావరించారని నోటీసుల్లో పేర్కొన్నారు.
బండి సంజయ్ కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, ఫోన్ ట్యాపింగ్ చేశానని, కేసుల నుంచి తప్పించుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా కలిసిపోయానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని మాజీ మంత్రి సవాల్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయబడ్డాయని దీని కారణంగా ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా డ్రగ్స్ ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ఇవి కూడా చదవండి...
Viral Video: దూడకు జన్మనిచ్చిన గేదె.. అంతలోనే చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
ED Investigation: భూదాన్ భూముల భాగోతం.. ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి
Read Latest Telangana News And Telugu News