Share News

Telangana: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:18 PM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు. తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు.

Telangana: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..
BRS Working President KTR

హైదరాబాద్, అక్టోబర్ 23: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీస్ పంపించారు. తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. తాను డ్రగ్స్ తీసుకుంటానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. తన పరవుకు నష్టం కలిగించాయని కేటీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ కామెంట్స్ నిరాధారమైనని అన్నారు.


అక్టోబర్ 19వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై నాపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డానని బండి సంజయ్ నిరాధారణ ఆరోపణలు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా బండి సంజయ్ ప్రస్తావరించారని నోటీసుల్లో పేర్కొన్నారు. సంజయ్ కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులో కేటీఆర్ తెలిపారు.


కేవలం తనను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశతంతోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, ఫోన్ ట్యాపింగ్ చేశానని, కేసుల నుంచి తప్పించుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా కలిసిపోయానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని కేటీఆర్ సవాల్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు విస్తృతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయబడ్డాయని దీని కారణంగా ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకొనే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా డ్రగ్స్ ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. వాటిన్నింటిని ఉద్దేశపూర్వకంగా కల్పించిన కట్టుకథలుగా కొట్టిపారేశారు.


కేంద్రమంత్రిగా బాధ్యతయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ లాంటి వ్యక్తి చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం తనపై బురద చల్లాలన్న దురుద్దేశం, తమ పార్టీ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ నోటీసులో తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, 9 ఏళ్లు రాష్ట్ర మంత్రి గా తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేసిన తనను ఉద్దేశపూర్వకంగా బద్నాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారని చెప్పారు. గతంలోనూ బండి సంజయ్ తనపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే శక్తి లేకనే తన వ్యక్తిత్వంపై బురదచల్లే ప్రయత్నం గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదే పదే ఇలాంటి ఆరోపణలు చేయటం ద్వారా ప్రజల్లో తన ప్రతిష్టను నాశనం చేయాలనే కుట్ర తప్ప వారి ఆరోపణల్లో నిజం లేదన్నారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. అసత్య ప్రచారం చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ లీగల్ నోటీసులో హెచ్చరించారు.


Also Read:

రేవంత్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన కేటీఆర్

అడ్డంగా బుక్కైన మాజీ స్పీకర్ తమ్మినేని..

బైక్ అంటేనే భయం పుట్టేలా చేశాడుగా..

For More Telangana News and Telugu News..

Updated Date - Oct 23 , 2024 | 12:18 PM