Home » Kuppam
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు మంగళవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్నారు. ముందుగా కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని జననాయకుడు సెంటర్‌ను ప్రారంభిస్తారు.
‘నా చిన్నప్పుడు ఇంట్లో కరెంటు ఉంటే గొప్పగా చెప్పుకొనేవాళ్లం. ఇప్పుడు మన ఇళ్లపై మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగాం. కుప్పంలోని నడిమూరు..
స్వర్ణ కుప్పం విజన్-2029 డాక్యుమెంటరీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్యుమెంటరీని సీఎం చంద్రబాబు విడుదల చేశారు.
చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజులు (6, 7) పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ రెండు రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు రాకకు ముందే కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిసింది. కుప్పం మున్సిపాలిటీ, నియోజకవర్గ అభివృద్ధికోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవోలు విడుదల చేసింది.
సీఎం చంద్రబాబు భార్యగా తాను కుప్పం నియోజకవర్గంలో పర్యటించలేదని, టీడీపీ కార్యకర్తగా పార్టీ శ్రేణులతో పాటు..
చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో జైలుకు వెళ్లినప్పుడు పోరాడింది స్త్రీలేనని వారి శక్తి అపారమని, వారు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ స్వయంగా పూనుకుంటోంది. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, నాయకుల చుట్టూ తిరగకుండా సింగిల్‌విండో పరిష్కార వేదికగా కార్యాలయాలను తయారు చేస్తోంది.
వైఎస్సార్‌సీపీ హాయంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆర్థికంగా సహాయ సాకారం అందిస్తున్నామని తెలిపారు.
కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. నాటి సరదాలే కాదు.. చిన్న వయసులోనే పెళ్లయిన అమాయకత్వాన్ని, ఏమీ తెలియనితనంనుంచి భర్త చంద్రబాబు దన్నుతో హెరిటేజ్ సారథిగా సాధించిన విజయాలను తలపోశారు. అన్న బాలకృష్ణ డైలాగ్‌ను వల్లించారు.