Home » Lalu prasad yadav
బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వైదొలగి, ఎన్డీఏలో చేరడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
బిహార్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్ 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత, మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చెత్త మళ్లీ చెత్తబుట్టలోకి వెళ్లిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం నితీష్ కుమార్ రాజీనామాతోనూ, బీజేపీతో చెలిమికట్టి తిరిగి సీఎం పగ్గాలు చేపట్టనుండటంతోనూ తెరపడకపోవచ్చని తెలుస్తోంది. తన కుమారుడు తేజస్వి యాదవ్‌ను సీఎంగా చూడాలనే పట్టుదలతో ఉన్న ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్... నితీష్ ఎత్తుకు పైఎత్తు వేసేందుకు బలమైన వ్యూహరచన చేస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం.
బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం భూములు(Land for job scam) తీసుకున్నారన్న కేసులో ఈడీ(ED) వరుసగా పలువురిని విచారిస్తూ వస్తోంది. శుక్రవారం డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 29న మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ని హాజరుకావాలని ఆదేశించగా.. మరుసటి రోజే తేజస్వి రావాలని సూచిస్తూ సమన్లు జారీ చేసింది.
లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా కూటమి' మధ్య సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రావడం అంత ఆషామాషీ వ్యహహారం కాదని ఆర్జేడీ సుప్రీం లాలూప్రసాద్ యాదవ్ తేల్చేశారు. దీనికి సమయం పడుతుందని చెప్పారు.
పంచ్ డైలాగ్‌లు విసరి నవ్వులు పూయించడంలో ఆర్జేడీ సుప్రీం, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు మంచి పేరుంది. ఆసక్తికరంగా ఈసారి ఆయన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్‌పై పంచ్ విసిరారు. ''నా భార్యను కాకుండా మీ భార్యను సీఎం చేస్తానా?'' అంటూ కేంద్ర మంత్రిపై సెటైర్ వేశారు.
Scam: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav), ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్(Tejaswi Yadav)తో సన్నిహిత సంబంధాలున్న వ్యాపారవేత్త అమిత్ కత్యాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇవాళ అరెస్టు చేసింది.
లోక్‌సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందు బిహార్(Bihar) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల ప్రజల డిమాండ్ ని నెరవేర్చింది. కులాల(Caste Census) వారీగా లెక్కల్ని బయటకు తీసింది.
క్విడ్ ప్రోకోలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూ మార్పిడి చేసుకున్నారనే కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మాజీ కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు మరో 14 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది.