Loksabha Polls: కుటుంబం కోసమే లాలు తపన.. బీజేపీ తీవ్ర విమర్శలు
ABN , Publish Date - Apr 10 , 2024 | 04:16 PM
రాష్ట్రీయ్ జనతాదల్ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌పై భారతీయ జనతా పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయనకు కుటుంబ సభ్యులే ముఖ్యం అని మండిపడింది. లోక్ సభ ఎన్నికల తొలి జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. అందులో లాలు ఇద్దరు కూతుళ్లకు టికెట్ దక్కింది. దాంతో లాలు ప్రసాద్ యాదవ్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు చేసింది.
పాట్నా: రాష్ట్రీయ్ జనతాదల్ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌పై (Lalu Prasad Yadav) భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర విమర్శలు చేసింది. ఆయనకు కుటుంబ సభ్యులే ముఖ్యం అని మండిపడింది. లోక్ సభ ఎన్నికల తొలి జాబితాను ఆర్జేడీ (RJD) విడుదల చేసింది. అందులో లాలు ఇద్దరు కూతుళ్లకు టికెట్ దక్కింది. దాంతో లాలు ప్రసాద్ యాదవ్ లక్ష్యంగా బీజేపీ విమర్శలు చేసింది.
అవినీతి పరుడు
లాలు ప్రసాద్ యాదవ్ తీరును బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఖండించారు. ‘లాలు ప్రసాద్ యాదవ్ అవినీతి పరుడు. ఆయనకు ప్రజా సేవ కన్నా కుటుంబ ప్రయోజనాలే ముఖ్యం. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తారు. గత కొంత కాలం నుంచి ఆ పని చేస్తున్నారు. లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం కోసం జీవిస్తాడు. ఈ విషయం బీహార్ ప్రజలకు కూడా తెలుసు. కుటుంబం తప్ప లాలుకు మరొకటి ముఖ్యం కాదు అని’ సామ్రాట్ చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇద్దరికి టికెట్
లోక్ సభ ఎన్నికలకు సబంధించి తొలి జాబితాను ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఆ జాబితాలో లాలు ప్రసాద్ యాదవ్ ఇద్దరు కూతుళ్లు మీసా భారతి, రోహిణి ఆచార్యకు టికెట్ దక్కింది. మీసా భారతి ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి పాటలీపుత్ర నుంచి బరిలోకి దిగుతున్నారు. బీహార్‌లో కూటమి సీట్ల లెక్క తేలింది. 26 చోట్ల ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్, 5 లెప్ట్ పార్టీలకు టికెట్లను కేటాయించారు. ఫస్ట్ లిస్ట్‌లో 22 మందికి ఆర్జేడీ టికెట్ కేటాయించింది. అందులో లాలు ప్రసాద్ యాదవ్ కూతుళ్లు ఉండటంతో బీజేపీ విమర్శలు గుప్పించింది.
ఇది కూడా చదవండి:
Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. అందుకు నిరాకరించిన న్యాయస్థానం
మరిన్ని జాతీయ వార్తల కోసం