Share News

Lok Sabha Elections: బీహార్‌లో కాంగ్రెస్‌ను వెంటాడుతున్న కష్టాలు.. పొత్తులతో లాభమా.. నష్టమా..!

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:55 PM

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి అధికారం లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా.. ఎన్టీయే (NDA) కూటమి వ్యతిరేక పార్టీలను ఏకం చేసి ఇండియా పేరుతో కూటమి కట్టాయి. కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యూపీఏ కూటమి స్థానంలో వివిధ పార్టీల కలయికతో ఇండియా కూటమి ఏర్పడింది.

Lok Sabha Elections: బీహార్‌లో కాంగ్రెస్‌ను వెంటాడుతున్న కష్టాలు.. పొత్తులతో లాభమా.. నష్టమా..!

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా.. ఎన్టీయే (NDA) కూటమి వ్యతిరేక పార్టీలను ఏకం చేసి ఇండియా పేరుతో కూటమి కట్టాయి. కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని యూపీఏ కూటమి స్థానంలో వివిధ పార్టీల కలయికతో ఇండియా కూటమి ఏర్పడింది. మొదట్లో అన్ని పార్టీలు కలిసి ఉమ్మడిగా మీటింగ్‌లు పెట్టి.. తామంతా ఐక్యంగా ఉన్నామని చాటే ప్రయత్నం చేశాయి. ఎన్నికల సమయం దగ్గరపడటంతో కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి.

కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్‌ను ఇతర పార్టీలు శాసించడం మొదలుపెట్టాయి. గతంలో కాంగ్రెస్ కూటమిలో పార్టీలకు సీట్లు ఇచ్చేవి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో బలంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు సీట్లు ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడినట్లైంది. హస్తం పార్టీ సీట్లు ఆశించిన చాలా మందికి వివిధ రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. దీంతో ఇండియా (INDIA) కూటమి కట్టడం వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి రాజకీయ ప్రయోజనం చేకూరింది? అనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది. ప్రస్తుతం మాత్రం ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులు పడుతోంది.

Congress: ‘గాలి’ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి..

బీహార్‌లో..

బీహార్‌లో పూర్నియా లోక్‌సభ స్థానానికి సంబంధించి ఇండియా కూటమిలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. పూర్నియా లోక్‌సభ టికెట్ ఇవ్వాలనే ఒకేఒక షరతుతో పప్పు యాదవ్ తన జన్ అధికార్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు.అయితే పూర్నియా సీటును కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు ఆర్జేడీ సిద్ధంగా లేదు. పూర్నియా స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ బీమా భారతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు పూర్నియా స్థానం నుంచి పోటీ చేసేందుకు పప్పు యాదవ్ పట్టుదలతో ఉన్నారు. ఆర్జేడీని ఒప్పించి కాంగ్రెస్ ఈ సీటును తీసుకోకపోతే.. పప్పు యాదవ్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడనుంది. అలాగే కాంగ్రెస్‌పైనా కొంతప్రభావం చూపించే అవకాశం ఉంది.

మరోవైపు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన కన్హయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. కన్హయ్య 2019 ఎన్నికల్లో బీహార్‌లోని బెగుసరాయ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయనపై ఆర్జేడీ అభ్యర్థిని నిలబెట్టగా, ఈసారి లాలూ ప్రసాద్ యాదవ్ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని వామపక్షాలకు కేటాయించారు. ఈ సీటు కాంగ్రెస్‌కు వచ్చి ఉంటే కన్హయ్య కుమార్ మరోసారి ఎన్నికల బరిలోకి ఉండేవారు. ఈ సీటు వామపక్షాలకు వెళ్లిపోవడంతో కన్హయ్య కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై స్పష్టత లేదు.దీంతో పొత్తుల వల్ల కాంగ్రెస్‌కు లాభమా.. నష్టమా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.

Bangalore: అబ్బో అధికారిక ఆస్తులే అన్ని ఉంటే.. ఇక అనధికారికంగా ఎన్ని ఉంటాయో.. డీకే ఆస్తులు రూ.593 కోట్లు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 29 , 2024 | 03:06 PM