Home » Lok Sabha Election 2024 Live Updates
నరేంద్ర మోదీ సరైన సమయంలో భారత దేశానికి లభించిన సరైన నాయకుడని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. తన విధానాలను సమర్థంగా అమలు చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని.. విజన్ ఉన్న ఆయన హయాంలో ఏది అనుకుంటే అది సాధించగలమని ప్రశంసించారు. శుక్రవారమిక్కడ పార్లమెంటు సెంట్రల్ హాలులో శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7-15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాష్ట్రపతి భవన్ నుంచి శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. అంతకు ముందు మోదీని ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నామని, ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమికి చెందిన నేతలందరూ రాష్ట్రపతి ముర్మును కలిసి సంయుక్త లేఖను సమర్పించారు.
కేంద్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకునేందుకు కృషి చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అన్నింటికన్నా దేశం ముఖ్యం అన్న సూత్రానికి కట్టుబడి ఎన్‌డీఏ కూటమి పని చేస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎన్డీయే కూటమి అధ్యక్షునిగా భాగస్వామ్య పార్టీలు నరేంద్ర మోదీని ఎన్నుకోవడంతో ఆయన వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు విదేశీ నేతలు హాజరుకానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ కార్యక్రమానికి రావడం ఖాయమైంది.
ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన త్వరలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోందని వస్తున్న వదంతులపై ఆ పార్టీ ఖండించింది. తాము ఇండియా కూటమిలోనే కొనసాగనున్నామని స్పష్టం చేసింది. శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యురాలు, ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ గురువారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల క్రితం హామీ ఇచ్చారని, ఇప్పుడైనా ఆ హామీని నెరవేరుస్తారా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్‌కు సంబంధించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. మోదీని ఉద్దేశిస్తూ నాలుగు ప్రశ్నలు సంధించారు. ఆ వీడియోను గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘
ఇండియా కూటమికి అద్భుతమైన ఫలితాలను అందించిన యూపీ ప్రజలకు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ధన్యవాదాలు తెలిపారు. యూపీ వాసులు దేశ ప్రజలకు ధృడమైన సందేశం ఇచ్చారని, రాజ్యాంగ రక్షణకు వారు చూపిన తెగువ అద్భుతమైనదని గురువారం ఎక్స్ వేదికగా కొనియాడారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) శనివారం సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగే ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారని సమాచారం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాలు సాధించి రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.
కొత్తగా కొలువు దీరనున్న 18వ లోక్‌సభకు ఎన్నికైన 543 మంది ఎంపీలలో 251 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. మొత్తం లోక్‌సభ ఎంపీలలో వీరు 46 శాతంగా ఉన్నారు. గత లోక్‌సభలో క్రిమినల్ కేసులున్న ఎంపీల సంఖ్య 233 కాగా ఈసారి మరింత పెరిగింది. 2004లో 125 మంది, 2009లో 162 మంది, 2014లో 185 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అత్యున్నత చట్టసభకు ఎన్నికవుతున్న క్రిమినల్ నేతల సంఖ్య పెరుగుతోందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, వారి కోసం పనిచేసే ఎగ్జిట్‌పోల్స్ సంస్థలు కలిసి దేశంలోనే భారీ స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున స్టాక్‌మార్కెట్ పతనమవ్వడంతో 5 కోట్ల మంది మదుపరులు భారీగా నష్టపోయారని, రూ.30 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైందని చెప్పారు.