Home » Lok Sabha Elections
విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో నలుగురు ప్రధాన పార్టీ అభ్యర్థులు కాగా.. మిగతా వారు రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు. బ్యాలెట్‌లో మొత్తం 16 క్రమ సంఖ్యలు ఉండగా.. మొదటి1 5 అభ్యర్థులకు సంబంధించినవి, 16వ క్రమసంఖ్య నోటాను సూచిస్తుంది.
Lok Sabha Election Polling 2024: తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని స్థానాలకు ఈ 4వ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ఎండలు, వర్షం భయం కారణంగా.. త్వరగా ఓటేస్తే మంచిదని అభిప్రాయపడుతున్న జనాలు.. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గం నుంచి మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో ప్రధానపార్టీ అభ్యర్థులు నలుగురు ఉన్నారు. మిగతా ఐదుగురు రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈవీఎంలో మొత్తం పది వరుసలు ఉండగా చివరిది నోటా.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ(ap elections 2024) పలు చోట్ల ప్రశాతంగా పోలింగ్(polling) జరుగుతుండగా, మరికొన్ని చోట్ల మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా(palnadu district)లోని వెల్దుర్తి మండలంలోని గొట్టిపాళ్లలో గందరగోళం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కనీసం ఐదుగురు నుంచి 20 మంది వరకు పోటీలో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో కొన్ని పోలింగ్ బూత్‌లలో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఎక్కువమంది అభ్యర్థులు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతూఉంటారు. ఒకరికి వేద్దామని వెళ్లి మరొకరికి వేసే అవకాశం ఉంటుంది.
దేశవ్యాప్తంగా 2024 లోక్‌సభ ఎన్నికల(loksabha elections 2024) నేపథ్యంలో నేడు నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 96 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్(hyderabad) జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్(Allu Arjun) ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల (ap elections 2024) పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. ఈ నేపథ్యంలో అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు సహా పలు అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని 42,43 డివిజన్ పోలింగ్ కేంద్రాల వద్ద అనుమతి లేకుండా వైసీపీ టెంట్లు(tents) ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.
Lok Sahba Elections 4th Phase Polling: దేశ వ్యాప్తంగా10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. తెలంగాణలోనూ నేడు పోలింగ్ జరగనుంది. నాలుగో దశలో తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లో 25, ఉత్తరప్రదేశ్‌లో 13, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, పశ్చిమ బెంగాల్ 8, జమ్మూ కాశ్మీర్‌లో 1 చొప్పున లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 175 శాసనసభ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఓటు వేసేందుకు ఇప్పటికే ఓటరు స్లిప్, ఐడి కార్డు అందరూ రెడీ చేసుకుని ఉంటారు. ఉదయం 7వ గంట కొట్టగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తూ ఉంటారు. ఎన్నికలు అంటేనే ఎన్నో అనుమానాలు. ఈ క్రమంలో సాధారణ ఓటర్లు అయితే పోలింగ్ బూత్‌కి వెళ్లి ఈవీఎంలో బటన్ నొక్కి ఓటు వేసి వస్తారు.
ఎన్నికలంటే వెంటనే గుర్తొచ్చేది చేతి వేలిపై వేసే సిరా గుర్తునే.. ఎన్నో సిరాలున్నా.. ఎన్నికల సమయంలో ఉపయోగించే సిరా వెరీ స్పెషల్. ఎందుకంటే ఓసారి సిరా గుర్తు వేస్తే అది వెంటనే చెరిగిపోదు. కనీసం వారం రోజుల వరకు ఆ గుర్తు చేతివేలిపై ఉంటుంది. అలాఅని పెద్దగా కూడా వేయరు. జస్ట్ ఓ చుక్కఅంటిస్తారు. చేతి వేలిపై సిరా చుక్క అంటించగానే అది వెంటనే అతుక్కుపోతుంది. దొంగ ఓట్లను నివారించడానికి ఈసిరా వాడుతుంటారు.