AP Elections 2024: టీడీపీ నేత రెడ్యా నాయక్‌పై వైసీపీ శ్రేణుల దాడి
ABN , Publish Date - May 13 , 2024 | 09:21 AM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ(ap elections 2024) పలు చోట్ల ప్రశాతంగా పోలింగ్(polling) జరుగుతుండగా, మరికొన్ని చోట్ల మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా(palnadu district)లోని వెల్దుర్తి మండలంలోని గొట్టిపాళ్లలో గందరగోళం నెలకొంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ(ap elections 2024) పలు చోట్ల ప్రశాతంగా పోలింగ్(polling) జరుగుతుండగా, మరికొన్ని చోట్ల మాత్రం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా(palnadu district)లోని వెల్దుర్తి మండలంలోని గొట్టిపాళ్లలో గందరగోళం నెలకొంది. టీడీపీ నేత రెడ్యా నాయక్‌పై వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. ఆ క్రమంలో ఆయన కారు ధ్వంసం చేసి నానా రచ్చ సృష్టించారు. దీంతో స్థానిక టీడీపీ(TDP) నేతలు వైసీపీ(YSRCP) నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇలాంటి దాడులు చేయడం సరికాదని అంటున్నారు. మరోవైపు ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
2024 లోక్‌సభ ఎన్నికల (loksabha election 2024) నాలుగో దశ పోలింగ్ ఈరోజు అంటే మే 13, సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ దశలో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 96 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
Lok Sabha Polls 2024: ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్, బన్నీ..
AP Elections: జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర.. టీడీపీ ఆందోళన
Read Latest AP News And Telugu News