Share News

Elections 2024: ఓటరు వేలికి వేసే సిరా ధర ఎంతో తెలుసా.. ఎక్కడ దొరుకుతుందంటే..!

ABN , Publish Date - May 12 , 2024 | 08:00 PM

ఎన్నికలంటే వెంటనే గుర్తొచ్చేది చేతి వేలిపై వేసే సిరా గుర్తునే.. ఎన్నో సిరాలున్నా.. ఎన్నికల సమయంలో ఉపయోగించే సిరా వెరీ స్పెషల్. ఎందుకంటే ఓసారి సిరా గుర్తు వేస్తే అది వెంటనే చెరిగిపోదు. కనీసం వారం రోజుల వరకు ఆ గుర్తు చేతివేలిపై ఉంటుంది. అలాఅని పెద్దగా కూడా వేయరు. జస్ట్ ఓ చుక్కఅంటిస్తారు. చేతి వేలిపై సిరా చుక్క అంటించగానే అది వెంటనే అతుక్కుపోతుంది. దొంగ ఓట్లను నివారించడానికి ఈసిరా వాడుతుంటారు.

Elections 2024: ఓటరు వేలికి వేసే సిరా ధర ఎంతో తెలుసా.. ఎక్కడ దొరుకుతుందంటే..!
Elections

ఎన్నికలంటే వెంటనే గుర్తొచ్చేది చేతి వేలిపై వేసే సిరా గుర్తునే.. ఎన్నో సిరాలున్నా.. ఎన్నికల సమయంలో ఉపయోగించే సిరా వెరీ స్పెషల్. ఎందుకంటే ఓసారి సిరా గుర్తు వేస్తే అది వెంటనే చెరిగిపోదు. కనీసం వారం రోజుల వరకు ఆ గుర్తు చేతివేలిపై ఉంటుంది. అలాఅని పెద్దగా కూడా వేయరు. జస్ట్ ఓ చుక్కఅంటిస్తారు. చేతి వేలిపై సిరా చుక్క అంటించగానే అది వెంటనే అతుక్కుపోతుంది. దొంగ ఓట్లను నివారించడానికి ఈసిరా వాడుతుంటారు. చాలామందికి ఓ డౌట్ రావచ్చు. అసలు ఈసిరా ఎక్కడ దొరుకుతుంది. ఎంత ఖర్చు అవుతుందనే అనుమానం చాలామందిలో కలగొచ్చు. ఈసిరాను ప్రభుత్వ సంస్థనే తయారుచేస్తుంది. ఎన్నికల్లో సిరా కోసం భారత ఎన్నికల సంఘం దాదాపు 50 కోట్ల రూపాయిలకు పైగా ఖర్చు చేస్తుంది. దేశం మొత్తానికి ఒకేచోట ఈసిరాను తయారుచేస్తారు. ఇలాంటి సిరా మరెక్కడా దొరకదు. ఈసిరాను బయట విక్రయించినా నేరమే అవుతుంది. కేవలం ఎన్నికల కోసం మాత్రమే ప్రత్యేకంగా ఈసిరాను ఉపయోగిస్తారు.

Vijayawada: ఎన్నికలకు సర్వం సిద్ధం.. సిరా విషయంలో కలెక్టర్ క్లారిటీ


అందరికీ ఒకటే..

ఎన్నికల వేళ అందరికీ ఒకే రకమైన సిరా ఉపయోగిస్తారు. సామాన్యుడి నుంచి ప్రముఖుడి వరకు, సినిమా స్టార్ నుంచి రాజకీయ నాయకుడి వరకు ఎవ్వరైనా సరే ఓటు వేసే సమయంలో ఈ సిరా కచ్చితంగా పూసుకోవాల్సిందే. ఒకవేళ సిరా వేయించుకోకపోతే అది నేరంగా పరిగణిస్తారు. ఏ ఓటరు ఉద్దేశపూర్వకంగా తన వేలికి సిరాను నిరాకరించకూడదు.


తయారీ ఎక్కడంటే..

ఎన్నికల్లో ఉపయోగించే సిరా మొత్తాన్ని దేశంలోని ఒకే ఒక్క కంపెనీ తయారు చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో గల మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ దీనిని తయారుచేస్తుంది. దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. అక్కడ ఉపయోగించే సిరా ఈ కంపెనీ నుంచే వస్తుంది. ఈ సంస్థ యజమానిగా కర్ణాటక ప్రభుత్వం వ్యవహరిస్తుంది. స్థానిక సంస్థలు మొదలు లోక్‌సభ ఎన్నికల వరకు ఎక్కడైనా ఇక్కడి సిరానే ఉపయోస్తారు.


ధర ఎంతంటే..

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల కోసం మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ సంస్థకు భారత ఎన్నికల సంఘం 26.5 లక్షల వయల్స్‌ కావాలని ఆర్డర్ పెట్టింది. వీటి విలువ దాదాపు రూ.55 కోట్లు. ఒక్కో వయల్‌లో పది మిల్లీ లీటర్ల సిరా ఉంటుంది. దీనిని దాదాపు 700 మంది ఓటర్ల వేలికి పూయవచ్చు. అంటే ఒక్కో వయల్ ధర దాదాపు 208 రూపాయిలు. ఒక్క మనిషికి సిరా వేసేందుకు అయ్యే ఖర్చు 29పైసలు. ఈ సిరాను దేశంలో బయట వ్యక్తులకు విక్రయించరు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

AP Elections2024: చంద్రబాబు ఓటు వేసేది ఎక్కడంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 12 , 2024 | 08:03 PM