Share News

విజయవాడలో ఓటు వేస్తున్నారా.. ఇవి గుర్తించుకోండి..!

ABN , Publish Date - May 13 , 2024 | 09:09 AM

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కనీసం ఐదుగురు నుంచి 20 మంది వరకు పోటీలో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో కొన్ని పోలింగ్ బూత్‌లలో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఎక్కువమంది అభ్యర్థులు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతూఉంటారు. ఒకరికి వేద్దామని వెళ్లి మరొకరికి వేసే అవకాశం ఉంటుంది.

విజయవాడలో ఓటు వేస్తున్నారా.. ఇవి గుర్తించుకోండి..!
Vijayawada Lok Sabha Set

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కనీసం ఐదుగురు నుంచి 20 మంది వరకు పోటీలో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో కొన్ని పోలింగ్ బూత్‌లలో రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. సాధారణంగా ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఎక్కువమంది అభ్యర్థులు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతూఉంటారు. ఒకరికి వేద్దామని వెళ్లి మరొకరికి వేసే అవకాశం ఉంటుంది. ఈవీఎంలో ప్రధానపార్టీ అభ్యర్థుల గుర్తులు ముందువరుసలో ఉంటాయి. ఆ తరువాత రిజిస్టర్డ్ పార్టీలు, స్వంతంత్ర అభ్యర్థుల గుర్తులు ఉంటాయి. ఓటువేసేటప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుల ఆధారంగా ఓటు వేయ్యొచ్చు. అలాగే పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్ ఈవీఎంలో ఉంటుంది. ఆ పేరు ఎదురుగా ఉన్న బటన్ ప్రెస్ చేసి మనకు కావాల్సిన అభ్యర్థికి ఓటు వేయ్యొచ్చు.

AP Elections 2024: ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్..


విజయవాడ లోక్‌సభ నుంచి

విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. ఈవీఎంలో 18 వరుసలు ఉంటాయి. చివరిది నోటా ఉంటుంది. ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టంలేని పక్షంలో నోటాపై ఓటువేసేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించింది. ఈ నియోజకవర్గంలో మొదటి నలుగురు ప్రధాన పార్టీ అభ్యర్థులు కాగా.. మిగిలిన వ్యక్తులు రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు. విజయవాడ లోక్‌సభ స్థానంలో బ్యాలెట్‌లో మొదటి నెంబర్ టీడీపీ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) కాగా.. రెండో నెంబర్ వైసీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని), మూడో అభ్యర్థి కాంగ్రెస్‌ పార్టీ నుంచి భార్గవ్ వల్లూరు, నాలుగో అభ్యర్థిగా బీఎస్పీ నుంచి మేకా వెంకటేశ్వరరావు పోటీలో ఉన్నారు. ఆరువాత 13 మంది ఇతర అభ్యర్థులు ఉన్నారు.


AP Elections: ఏడు గంటలకే పోలింగ్ కేంద్రానికి కేశినేని చిన్ని.. కానీ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 13 , 2024 | 09:12 AM