Share News

Elections 2024: చూపు కనబడని వ్యక్తుల ఓటు బంధువులు వేయ్యొచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..

ABN , Publish Date - May 12 , 2024 | 09:01 PM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 175 శాసనసభ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఓటు వేసేందుకు ఇప్పటికే ఓటరు స్లిప్, ఐడి కార్డు అందరూ రెడీ చేసుకుని ఉంటారు. ఉదయం 7వ గంట కొట్టగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తూ ఉంటారు. ఎన్నికలు అంటేనే ఎన్నో అనుమానాలు. ఈ క్రమంలో సాధారణ ఓటర్లు అయితే పోలింగ్ బూత్‌కి వెళ్లి ఈవీఎంలో బటన్ నొక్కి ఓటు వేసి వస్తారు.

Elections 2024: చూపు కనబడని వ్యక్తుల ఓటు బంధువులు వేయ్యొచ్చా.. రూల్స్ ఏం చెబుతున్నాయి..
Voters

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 175 శాసనసభ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఓటు వేసేందుకు ఇప్పటికే ఓటరు స్లిప్, ఐడి కార్డు అందరూ రెడీ చేసుకుని ఉంటారు. ఉదయం 7వ గంట కొట్టగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తూ ఉంటారు. ఎన్నికలు అంటేనే ఎన్నో అనుమానాలు. ఈ క్రమంలో సాధారణ ఓటర్లు అయితే పోలింగ్ బూత్‌కి వెళ్లి ఈవీఎంలో బటన్ నొక్కి ఓటు వేసి వస్తారు. ఈవీఎంలో అభ్యర్థుల సింబల్స్ ఉంటాయి. ఓటరు తమకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై ఓటు వేస్తారు. అదే సమయంలో విభిన్న ప్రతిభావంతులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. కానీ కొంతమంది వృద్ధులకు చూపు సరిగ్గా కనిపించదు. దీంతో గుర్తులు ఎక్కడున్నాయి. ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించదు. దీంతో చూపు సరిగ్గాలేని ఓటర్లు తమ ఓటును సక్రమంగా వినియోగించుకునే అవకాశాలు తక్కువ. మరి చూపు సరిగ్గా కనిపించకపోయినా.. చూపులేని వాళ్ల తరపున బంధువులు ఓటు వేయ్యొచ్చా అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. ఇటువంటివాళ్ల కోసం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రిసైడింగ్ అధికారికి లేదా రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. సాధారణంగా ఇటువంటి చిన్న సమస్యలను ప్రిసైడింగ్ అధికారి పరిష్కరిస్తారు. ఏదైనా వివాదం తలెత్తితే రిటర్నంగ్ అధికారిని సంప్రదిస్తారు.

Vijayawada: ఎన్నికలకు సర్వం సిద్ధం.. సిరా విషయంలో కలెక్టర్ క్లారిటీ


చూపుకనబడని వారి విషయంలో..

ఓటర్ల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు ఉంటుంది. వారికి ఏదైనా శారీరక వైకల్యం ఉన్నా.. కంటి చూపు సరిగ్గా లేకపోయినా ఓటు వేసేందుకు నిరాకరించడానికి వీలులేదు. కానీ చూపుసరిగ్గా కనబడని వ్యక్తులను పోలింగ్ బూత్‌లోకి వాళ్ల కుటుంబ సభ్యులు లేదా ఎవరైనా సహాయకులు తీసుకువస్తుంటారు. అటువంటి వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఓటర్ వెరిఫికేషన్ చేస్తారు. అతడే ఓటరు అని నిర్థారించుకున్న తర్వాత ఓటరు లేదా అతడి సహయకుడు పోలింగ్ బూత్‌లో ఎన్నికల సిబ్బందికి విషయాన్ని తెలియజేయాలి. అప్పుడు ఓటరుతో వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యుడా లేదా ఏదైనా పార్టీకి చెందిన వ్యక్తినా లేక ఇతరులు ఎవరైనా అనే విషయాన్ని తెలుసుకుంటారు. పార్టీ ప్రతినిధి అయితే సాధారణంగా ప్రత్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం చెబుతారు. కుటుంబ సభ్యుల విషయంలో పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ కుటుంబ సభ్యుడు కాకుండా వేరే వ్యక్తి అయితే పోలింగ్ ఏజెంట్లు ఎవరైనా అభ్యంతరం చెబితే సహయకుడిని ఓటు వేసేందుకు అనుమతించరు. ఏజెంట్లు అంతా అంగీకారం తెలిపితే ఓటరును అడిగి దేనికి వేయమంటే దానికి ఓటు వేయ్యొచ్చు.


ఒకవేళ చూపు కనిపించని ఓటరుతో ఓటు వేసేందుకు సహయకుడిని అనుమతించకపోతే మాత్రం చూపు సరిగ్గా కనిపించని వ్యక్తి తరపున ప్రిసైడింగ్ అధికారి లేదా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారుల్లో సీనియర్ అధికారి ఆ ఓటరు అభిప్రాయాన్ని అడిగి ఎవరికి ఓటు వేయమంటే వారికి వేస్తారు. ఎన్నికల అధికారిపై కూడా ఏజెంట్లకు ఏదైనా అభ్యంతరాలుంటే ఏజెంట్ సమక్షంలోనే ఎన్నికల అధికారి ఓటరు ఓటును వేస్తుంటారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. వాస్తవానికి ఒక ఓటరు ఓటు మరొవ్యక్తి వేయడానికి వీలులేనప్పటికీ.. ఓటరు ఓటు సక్రమంగా వినియోగించుకునేందుకు వీలుగా ఇలా చేస్తుంటారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

AP Elections2024: చంద్రబాబు ఓటు వేసేది ఎక్కడంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - May 12 , 2024 | 09:14 PM