Home » Lok Sabha Elections
ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది జూన్4న తేలనుంది. అయితే అంతకంటే ముందు అనేక ఎగ్జిట్‌పోల్స్ విడుదలవుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేదానిపై పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో దశ పోలింగ్ ముగిసింది. జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా 57 స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో.. ఏప్రిల్ 19వ తేదీ నుంచి..
తెలంగాణలో 4వ విడత లోక్‌సభ ఎన్నికలు మే 13న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ వికాస్‌రాజ్(CEO Vikasraj) తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈసారి లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు.. వారం రోజుల గ్యాప్ చొప్పున ఏడు దశల్లో పోలింగ్ సాగింది. ఏడో దశ..
Lok Sabha Elections Of India: ఎన్నికల తుదిదశ పోలింగ్ వేళ కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India) కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్(Exit Poll 2024) వెల్లడించే సంస్థలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేశారో తప్పదు శిక్ష అంటూ హెచ్చరించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 126(ఏ)(1) ప్రకారం ఎన్నికలు జరుగుతున్నప్పుడు..
లోక్ సభ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. అధికార బీజేపీ(BJP), ప్రతిపక్ష కాంగ్రెస్ సహా దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో చెమటోడ్చాయి. 400 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ అందుకు తగినట్లే తీవ్రంగా శ్రమించింది.
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైనా.. తొలి రౌండ్ ఫలితం కోసం కొంత ఎదురుచూపులు తప్పవు. ఈవీఎంలు తెరవడం.. వాటిని టేబుళ్లపై చేర్చడం.. లెక్కించడం.. సరిపోల్చుకోవడం.. వాటిని రిటర్నింగ్ అధికారి నిర్ధారించుకొని ఫలితాన్ని ప్రకటించడం.. వీటన్నింటికీ గంటన్నర పట్టే అవకాశం ఉంది.
ఎవరేమనుకున్నా సరే.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేదు. తన బీజేపీ కోసం.. ఆయన యోధుడిలా రంగంలోకి దిగి..
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీజీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏడోవిడత ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఖర్గే మాట్లాడారు.
దేశం కోసం 100 సార్లైనా జైలుకి వెళ్లడానికి సిద్ధమేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో జూన్ 2న ఆయన పోలీసులకు తిరిగి లొంగిపోవాల్సి ఉంది.