Share News

AP Exlt Polls: సంచలనం రేపుతున్న పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్.. ఆ పార్టీదే విజయం..!

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:46 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది జూన్4న తేలనుంది. అయితే అంతకంటే ముందు అనేక ఎగ్జిట్‌పోల్స్ విడుదలవుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేదానిపై పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి.

AP Exlt Polls: సంచలనం రేపుతున్న పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్.. ఆ పార్టీదే విజయం..!
Exit Polls

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది జూన్4న తేలనుంది. అయితే అంతకంటే ముందు అనేక ఎగ్జిట్‌పోల్స్ విడుదలవుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేదానిపై పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి. మెజార్టీ సర్వేలు ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ సంస్థ పోస్ట్‌పోల్ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. మే16 నుంచి మే20వ తేదీలోపు 175 నియోజకవర్గాల్లోని 6,900 మంది నుంచి శాంపిల్స్ సేకరించినట్లు పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం నాలుగు పోలింగ్ బూత్‌ల నుంచి శాంపిల్స్ సేకరించింనట్లు తెలిపింది.

AP Election Exit Polls 2024: ఏపీలో గెలుపెవరిది.. ఒకే ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి..


కూటమిదే అధికారం..

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. టీడీపీకి 95 నుంచి 110, జనసేనకు 14 నుంచి 20, బీజేపీ 2 నుంచి 5 సీట్లు గెలుస్తుందని పీపుల్స్ పల్స్ తన పోస్ట్‌పోల్ సర్వేలో పేర్కొంది. మొత్తంగా కూటమికి 111 నుంచి 135 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 175 స్థానాల్లో పోటీ చేయగా.. టీడీపీ144, జనసేన 21, బీజేపీ 10 సీట్లలో పోటీ చేసింది.


null

వైసీపీకి..

వైసీపీకి 45 నుంచి 60 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది. 2019లో వైసీపీ 151 సీట్లు సాధించగా.. ఈసారి భారీగా ఆ పార్టీ సీట్లు తగ్గనున్నాయని పీపుల్స్ పల్స్ తెలిపింది. వైసీపీ 175 సీట్లలో ఒంటరిగా పోటీచేసింది.


ఓట్ల శాతం..

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 52 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది. వైసీపీకి 44 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, టీడీపీ కూటమికి, వైసీపీకి మధ్య దాదాపు 8 శాతం ఓట్ల తేడా ఉండనున్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ ఒక శాతం ఓట్లను సాధించనుండగా.. ఇతరులుకు 3 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 49.45 శాతం ఓట్లు రాగా.. ఈసారి గతంతో పోలిస్తే దాదాపు 6శాతం ఓట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.


null

పార్లమెంట్ స్థానాలు..

ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. టీడీపీ 13 నుంచి 15, జనసేన 2, బీజేపీ 2 నుంచి 4 చోట్ల గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వైసీపీ కేవలం 3 నుంచి 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రమే గెలుస్తుందని పీపుల్స్ పల్స్ తన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. టీడీపీ 17, జనసేన 2, బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసింది.


null

AP Exit Polls 2024: ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 06:36 PM