Home » Lok Sabha Polls 2024
ప్రస్తుతం తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ముగిసినందున బీజేపీ, కాంగ్రెస్ నేతలంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అధినేతల తరుఫున పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర భారత దేశంలోనే కాదు దక్షిణ భారత దేశంలోనూ ప్రధాని మోదీ వేవ్ కనిపిస్తోందన్నారు.
పోలింగ్ బూత్‌లోకి మొబైల్ తీసుకునేందుకు అనుమతి ఉండదు. గది బయట ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేస్తుంటారు. అలాంటిది ఓ యువకుడు మొబైల్ తీసుకోవడమే కాదు ఏకంగా వీడియో కూడా తీశాడు. మాములుగా అయితే ఒకసారి ఓటు వేయాలి. అతను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు ఓటు వేశాడు.
ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్ చౌదరి వైఖరి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీరియస్ అయ్యారు...
దేశవ్యాప్తంగా ఐదో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
నెల రోజుల క్రితం మొదలై సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో అత్యంత కీలకమైన ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. మొత్తం ఏడు దశలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. అతి తక్కువ స్థానాలకు పోలింగ్ జరిగే దశ ఇదే.
లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన హామీ ఇచ్చారు. ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వనని, ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికలు-2024 ఐదవ దశకు సర్వసిద్ధమైంది. రేపు (సోమవారం) ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 49 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
బాలీవుడ్ సెన్సేషన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగా అడుగిడి, దర్శకురాలిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. భారతీయ జనతా పార్టీలో చేరి, మండీ లోక్ సభ నుంచి బరిలోకి దిగారు. విపక్ష పార్టీలు, నేతలపై ఒంటికాలిపై లేస్తున్నారు.
ఓ వర్గం ఓట్లు పొందేందుకు పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Benerjee) హిందూ సంఘాలపై దాడి చేస్తోందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జార్ఖండ్‌లోని(Jharkhand) జంషెడ్‌పూర్‌లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.