Lok Sabha Polls 2024: సర్వసిద్ధం.. రేపే ఐదో దశ లోక్‌సభ పోలింగ్
ABN , Publish Date - May 19 , 2024 | 06:01 PM
లోక్‌సభ ఎన్నికలు-2024 ఐదవ దశకు సర్వసిద్ధమైంది. రేపు (సోమవారం) ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 49 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు-2024 ఐదవ దశకు సర్వసిద్ధమైంది. రేపు (సోమవారం) ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 49 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
ఈ విడత ఉత్తరప్రదేశ్‌లోని 14 లోక్‌సభ, మహారాష్ట్రలో 13, బెంగా ల్‌లో 7, బిహార్, ఒడిశాలో 5, ఝార్ఖండ్ 3 స్థానాలతో పాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో ఒక్కో నియోజక వర్గానికి పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 33 శాతం మంది కోటీశ్వ రులు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి.
ఈ దశలో పోటీ చేస్తున్న ప్రముఖ రాజకీయ నాయకుల జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరేలీ బరిలో నిలిచారు. ఇక రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లఖ్‌నవూ నుంచి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి , ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలుప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ లోక్ సభ స్థానం నుంచి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖలు వేర్వేరు నియోజకవర్గాల బరిలో ఉన్నారు.