Share News

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. చివరికి అధ్యక్ష స్థానానికి ఎన్నికైంది ఎవరంటే..?

ABN , Publish Date - Jun 26 , 2024 | 12:25 PM

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక పూర్తైంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగుతుందని భావించినప్పటికీ.. స్పీకర్‌గా ఓంబిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. తొలుత స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు.

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. చివరికి అధ్యక్ష స్థానానికి ఎన్నికైంది ఎవరంటే..?
Om Birla and Modi

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక పూర్తైంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగుతుందని భావించినప్పటికీ.. స్పీకర్‌గా ఓంబిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. తొలుత స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో స్పీకర్ పదవి కోసం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్డీయే కూటమి తరపున బీజేపీ నుంచి ఓం బిర్లా, కాంగ్రెస్ నుంచి సురేష్ కొడికున్నిల్ నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. దీంతో 18వ లోక్‌సభ తొలి సమావేశాల్లో భాగంగా మూడోరోజు సభ ప్రారంభం కాగానే.. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఘటాల్ ఎంపీ అధికారి దీపక్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌ నిర్వహించారు.

Rahul Gandhi: స్పీకర్ ఎన్నిక తరువాత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు


స్పీకర్ పదవి కోసం ఓం బిర్లాను ప్రతిపాదిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎన్డీయే పక్ష నేతలు సమర్థించారు. తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఓం బిర్లా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. జనసేన నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఓంబిర్లా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఇక కాంగ్రెస్ ఎంపీ సురేష్ కుడికొన్నల్ అభ్యర్థిత్వాన్ని ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన ఎంపీ అరవింద్ గణపతి సావంత్ ప్రతిపాదించారు. సురేష్ అభ్యర్థిత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు సమర్థించాయి. అయితే ఓంబిర్లాను ప్రతిపాదిస్తూ మోదీ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఎక్కువ మంది సభ్యులు మద్దతు ఉన్నట్లు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ వాయిస్ ఓటుతో ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
Om Birla 2.0: ఓం బిర్లా ఎవరు.. రాజకీయ నేపథ్యమేంటి?


ఇండియా కూటమి తరపున డివిజన్ అడిగినప్పటికీ.. అప్పటికే స్పీకర్ ఎన్నిక పూర్తైందని.. ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారని.. ఆయనను స్పీకర్ స్థానం వద్దకు తీసుకురావాల్సిందిగా అధికార, ప్రతిపక్షాలను కోరారు. దీంతో ఓంబిర్లా స్పీకర్ స్థానంలో ఆశీనులయ్యారు. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓంబిర్లాను స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ కరచాలనం చేశారు.

Lok Sabha Speaker Election: లోక్‌సభ స్పీకర్ పదవి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా గ్రాండ్ విక్టరీ


ఎన్నిక జరుగుతందని భావించినా..

లోక్‌సభ స్పీకర్ పదవి కోసం రెండు నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నిక జరుగుతుందని అంతా భావించారు. కానీ ప్రొటెం స్పీకర్ వాయిస్ ఓటుతో స్పీకర్ ఎన్నికను ముగించడంతో ఓంబిర్లా ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి ఓటింగ్ కోరినప్పటికీ అప్పటికే ఎన్నిక పూర్తైందని ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. దీంతో ఎన్నిక లేకుండానే ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు.


Ayodhya: రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్.. అయోధ్యలో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For More National News and Latest Telugu News click here

Updated Date - Jun 26 , 2024 | 01:46 PM