Share News

Lok Sabha 2024: మోదీ, రాహుల్ కరచాలనం.. సభలో సభ్యులంతా షాక్..

ABN , Publish Date - Jun 26 , 2024 | 01:07 PM

ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించి 18వ లోక్‌సభలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఎన్నికల ముందు వరకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు.

Lok Sabha 2024: మోదీ, రాహుల్ కరచాలనం.. సభలో సభ్యులంతా షాక్..
Modi and Rahul

ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సంబంధించి 18వ లోక్‌సభలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఎన్నికల ముందు వరకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. లోక్‌సభలో ఇద్దరు నేతలు చేతులు కలిపారు. స్పీకర్ ఎన్నిక ముందు వరకు ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అడుగుతూ వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించలేదు. దీంతో స్పీకర్ ఎన్నిక కోసం ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టింది. చివరికి వాయిస్ ఓటుతో ఎన్డీయే ప్రతిపాదించిన ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

Rahul Gandhi: స్పీకర్ ఎన్నిక తరువాత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు


స్పీకర్ ఎన్నిక సందర్భంగా లోక్‌సభలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓం బిర్లాను స్పీకర్‌గా స్థానం వద్దకు తీసుకురావాలని ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్‌ కోరారు. దీంతో ప్రధాని మోదీ, పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓంబిర్లా కూర్చున్న సీటు వద్దకు వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి.. స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఓం బిర్లా పక్కనే ఉన్న ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ కరచాలనం చేశారు. మోదీ కూడా నవ్వుతూ రాహుల్‌తో చేయి కలిపారు. ఆ తర్వాత ఓం బిర్లాను స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లారు.

Om Birla 2.0: ఓం బిర్లా ఎవరు.. రాజకీయ నేపథ్యమేంటి?


రాహుల్ కరచాలనంతో..

మోదీతో రాహుల్ కరచాలనం చేయడంతో ఒక్కసారిగా సభలో సభ్యులంతా అవాక్కయ్యారు. నిన్నటి వరకు తీవ్రంగా రాజకీయ విమర్శలు చేసుకున్న ఇద్దరు నేతలు నవ్వుతూ కరచాలనం చేసుకోవడంతో అంతా షాక్‌కు గురయ్యారు.


Lok Sabha Speaker Election: లోక్‌సభ స్పీకర్ పదవి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా గ్రాండ్ విక్టరీ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For More National News and Latest Telugu News click here

Updated Date - Jun 26 , 2024 | 01:38 PM