Home » Madanapalle
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో భూ రికార్డుల దహనం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరెట్లో ఫైళ్ల దహనం కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగు చూడగా.. ఇప్పుడిప్పుడే సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? అనేది తేల్చే పనిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై (Madanapalli fire incident) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కుటుంబంపైనే పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తొలిసారిగా స్పందించారు...
Andhrapradesh: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన చోట అడిషనల్ ఎస్పీ రాజకుమార్ సీన్‌ను రీ కన్స్ట్రక్షన్ చేశారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల తహసిల్దార్ కార్యాలయాలల్లో సోమవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక బృందాల తనిఖీలు నిర్వహించాయి. 22 ఏ ఫైల్స్ అన్నింటినీ కూడా ప్రత్యేక అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉండొచ్చని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు...
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఘటన (Madanapalle Incident) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. అసలేం జరిగింది..?..
Andhrapradesh: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎస్, సీఎంవో, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష చేపట్టారు. అగ్నిప్రమాదంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం.
Andhrapradesh: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై ప్రభుత్వ అత్యవసర విచారణకు ఆదేశించింది. అగ్నిప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధం అయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదమా?.. కుట్ర పూరితమా? అనే అంశంలో విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
మేమంతా సిద్ధం’ పేరుతో బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్‌కు అన్నమయ్య జిల్లా ప్రజలు గట్టి దెబ్బే కొట్టారు.