Share News

కన్వర్షన లేకుండా భూమి అభివృద్ధి చేయవద్దు

ABN , Publish Date - Sep 01 , 2024 | 12:00 AM

మండలంలోని చిప్పిలి గ్రామంలో భూమి ని కన్వర్షన చేయకుండా అభివృద్ధి చేయకుడదని రెవెన్యూ అధికారులు తెలిపారు.

కన్వర్షన లేకుండా భూమి అభివృద్ధి చేయవద్దు
భూ రికార్డులు పరీశీలిస్తున్న రెవెన్యూ అధికారులు

మదనపల్లె అర్బన, ఆగస్టు 31:మండలంలోని చిప్పిలి గ్రామంలో భూమి ని కన్వర్షన చేయకుండా అభివృద్ధి చేయకుడదని రెవెన్యూ అధికారులు తెలిపారు. 32 మందికి కలిసి 22 ఎకరాల భూమి ఉందని, ఇందులో అన లైన భూమికి సంబందించి రికార్డులు వన బీ, పాస్‌ పుస్తకాలు, సబ్‌ డివి జన కాలేదన్నారు. భూమిలో కాంపౌండు, నాన అగ్రికల్చర్‌ కింద అభివృద్ధి చేయరాదన్నారు. సర్వే నిర్వహించి, సబ్‌ డివిజన చేసి, కన్వర్షన చేయించు కోవాలన్నారు. అంతవరకు భూమిలో ఎలాంటి కట్టడాలు, నిర్మాణాలు చేయరాదని రైతులు వారి వారి రికార్డులు తెస్తే పరిశీలించి సర్వే నిర్వహి స్తామని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రెడ్డెప్ప, మండల సర్వేయర్‌ సుబ్రహ్మణ్యం, వీఆర్వో నారాయణ, సచివాలయ సర్వేయర్లు సురేష్‌, యశోదమ్మలు పాల్గొన్నారు. అనంతరం రైతులు బెంగుళూరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిలో వాహనాలు బారులు తీరాయి.

Updated Date - Sep 01 , 2024 | 12:00 AM